Raghurama: హైకోర్టులో సాక్షి కథనాలు నమ్ముతారా?, సీబీఐని నమ్ముతారా?...

ABN , First Publish Date - 2023-04-18T14:24:20+05:30 IST

ఢిల్లీ: ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) బెయిల్ పిటిషన్‌ (Bail Petition)పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) స్పందించారు.

Raghurama: హైకోర్టులో సాక్షి కథనాలు నమ్ముతారా?, సీబీఐని నమ్ముతారా?...

ఢిల్లీ: ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) బెయిల్ పిటిషన్‌ (Bail Petition)పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు (High Court)లో సాక్షి కథనాలు నమ్ముతారా?.. సీబీఐని నమ్ముతారా? అని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డిని పిలిస్తే పిలవండి కానీ అరెస్టు చేయొద్దని అంటారా?.. మధ్యంతరం బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం స్టే ఇస్తుందా? లేదో చూడాలన్నారు. వివేకానందరెడ్డి హత్య (Viveka Murder)పై గతంలో చంద్రబాబు (Chandrababu) హయాంలో ఒక సిట్ (SIT) వేశారని.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభిషేక్ మహంతితో విచారణ చేయించారన్నారు. ఆయన విచారణ త్వరగా చేశారని ట్రాన్స్‌ఫర్ చేశారన్నారు.

సీఐడీ సునీల్ కుమార్ అట్టర్ ఫ్లాప్ అయ్యారని.. అందుకే పక్కన పెట్టారని.. ఆయనను.. ఎన్ఐఏ, సీబీఐకి ఇన్వెస్టిగేషన్ చేయడం రాదంటారని సాక్షిలో ఎది పడితే అదే రాస్తున్నారని రఘురామ మండిపడ్డారు. అలాగే వైసీపీ వెబ్ సైట్‌లో కూడా సాక్షి పేపర్‌లో వచ్చినవే అందులో రాశారన్నారు. కేసు సుప్రీంకోర్టు ఈ నెలలో పూర్తి చేయాలని సీబీఐకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి బెయిల్ ఇవ్వకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

గూగుల్ టెక్ అవుట్ ఉంటుందని ఎంపీ అవినాష్ రెడ్డికి.. వారికి తెలియదని.. అందరూ ఒకే చోట కూర్చున్నారని, ఎవరెవరు వచ్చారు అనేది వాచ్‌మెన్ రంగన్న క్లియర్‌గా చెప్పారని రఘురామ అన్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డిపై సాక్ష్యాలు లేవని అంటున్నారు.. మరి హత్యకు రూ. 40 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో అనేది తన డౌట్ అని అన్నారు. కాగా అవినాష్ రెడ్డి ఇవాళ నాలుగు గంటలకు సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉందని.. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-04-18T14:24:20+05:30 IST