AP News: తుంగభద్రపై విమానం చక్కర్లు.. అసలు విషయం తెలిసి
ABN , First Publish Date - 2023-02-17T10:05:24+05:30 IST
జిల్లాలోని కోసిగి మండల పరిధిలోని తుంగభద్ర నదిపై విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది.
కర్నూలు: జిల్లాలోని కోసిగి మండల పరిధిలోని తుంగభద్ర నది (Tungabhadr River) పై విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. గత ఐదు రోజులుగా ఉదయం 9 గంటలకు ఒకసారి.. 11 గంటలకు మరోసారి తుంగభద్ర నది పరిసర ప్రాంతాల్లో విమానం తిరుగుతోంది. దీంతో నదీతీర గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే అసలు విషయం తెలిసి అంతా ఊపిరిపీల్చుకున్నారు.
అసలు విషయం ఏంటంటే... కేంద్ర ప్రభుత్వం అనుమతితో కోసిగి మండల పరిధిలో జెట్ విమానం ద్వారా బంగారు నిక్షేపాల కోసం అన్వేషణ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. పది రోజుల పాటు ఈ అన్వేషణ సాగనుంది. పుట్టపర్తి ఏయిర్ పోర్టు నుంచి ఈ ఆపరేషన్‌ను మొదలుపెట్టారు. అయితే జెట్ విమానం ద్వారా బంగారు నిక్షేపాల అన్వేషణ విషయం తమకు తెలియదని కోసిగి మండలం పోలీసు, రెవిన్యూ అధికారులు చెబుతున్నారు.