Yuvagalam Padayatra: లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు బ్లూ మీడియా కుట్రలు..
ABN , First Publish Date - 2023-05-08T11:29:54+05:30 IST
కర్నూలు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర (Padayatra)ను అడ్డుకునేందుకు బ్లూ మీడియా కుట్రలు పన్నుతోంది.
కర్నూలు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర (Padayatra)ను అడ్డుకునేందుకు బ్లూ మీడియా కుట్రలు పన్నుతోంది. పది మందిని పోగేసి నిరసన అంటూ వైసీపీ హైడ్రామా (YCP Hydrama) సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. నిరసన తెలిపిన వైసీపీ న్యాయవాదులకు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ (Strong Counter) ఇచ్చారు. హైకోర్టు (High Court) ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చి మోసం చేసిన సీఎం జగన్ (CM Jagan) ఇంటి ముందు నిరసన తెలపాలన్నారు.
మంత్రి బుగ్గన (Minister Buggana) బెంగళూరు వెళ్లి విశాఖలో హైకోర్టు అంటారని, అమరావతిలోనే హైకోర్టు అని సుప్రీంకోర్టులో అపిఢవిట్ వేశారని తెలిపారు. వైసీపీ లాయర్ల బ్లూ మీడియా నిరసన తెలపాల్సింది జగన్ ఇంటి ముందని, తన ఎదుట కాదని లోకేష్ సెటైర్లు వేశారు. కాగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర 93వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఎస్‌టీబీసీ కళాశాల, జిల్లా కోర్టు మీదుగా పాదయాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ప్రజలు లోకేష్‌కు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కొంతమంది లాయర్లు కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారికి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని నిరసన కారులను చెల్లాచెదురు చేశారు.
ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర జిల్లా కోర్టుకు చేరుకుంది. కొంతమంది న్యాయవాదులు లోకేష్‌కు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన లోకేష్‌కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. జగన్‌లా మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ తమది కాదన్నారు. బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు.