Byreddy Rajasekhar Reddy: మూడు రాజధానుల పేరిట ఏపీ ప్రజలకు మూడు నామాలు..
ABN , First Publish Date - 2023-02-16T15:58:30+05:30 IST
నంద్యాల: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై బీజేపీ నేత, రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Byreddy Rajasekhar Reddy) తీవ్ర విమర్శలు చేశారు.
నంద్యాల: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై బీజేపీ నేత, రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Byreddy Rajasekhar Reddy) తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ ఏపీ ప్రజలకు మూడు నామాలు పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి కేసు (YS Viveka Murder Case)లో ఇరుక్కొని వాటి వాసన కడుక్కోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి..
Amith Shah: ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలలో సమూల మార్పులు..
ఏపీ అభివృద్ధి కోసం పాటుపడకుండా మూడు ముక్కలాట.. రాజధానుల కోసం సీఎం జగన్ తహ తహ లాడుతున్నారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. అప్పర్ భద్ర ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించడం తప్పు అని అన్నారు. మూడు రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టు (Upper Bhadra Project)ను నిర్మించాలను కోవడం అన్యాయమని, అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు మరణశాసనమని అన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టును వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని.. రాయలసీమ అభివృద్ధి ముఖ్యమన్నారు. ఈనెల 28న సేవ్ రాయల సీమ పేరుతో ఛలో ఆదోని కార్యక్రమం నిర్వహిస్తామని.. పార్టీలకతీతంగా అందరూ పాల్గొనాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపిచ్చారు.