AP News: శిల్పా చక్రపాణి వద్దంటూ కరపత్రాలు.. ఆత్మకూరులో కలకలం
ABN , First Publish Date - 2023-10-31T10:22:42+05:30 IST
జిల్లాలోని ఆత్మకూరులో కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వద్దంటూ ఆత్మకూరులోని దుకాణాల్లో కొందరు ఆగంతకులు కరపత్రాలను పంపిణీ చేశారు.
నంద్యాల: జిల్లాలోని ఆత్మకూరులో కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి (MLA Shilpa Chakrapani Reddy) వద్దంటూ ఆత్మకూరులోని దుకాణాల్లో కొందరు ఆగంతకులు కరపత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అధికార పార్టీకి చెందిన నాయకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారని కరపత్రాల్లో తెలిపారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కరపత్రంలో దుండగులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి వ్యతిరేకంగా పంపిణీ అయిన ఈ కరపత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కరపత్రాలను ఎవరు పంపిణీ చేశారనే దానిపై ఎమ్మెల్యే అనుచరులు ఆరా తీసే పనిలో పడ్డారు.