Nandyala: శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు
ABN , First Publish Date - 2023-10-23T08:36:46+05:30 IST
నంద్యాల: శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం ప్రభుత్వం తరుపున మంత్రి గుమ్మనూర్ జయరామ్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి శ్రీస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
నంద్యాల: శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం ప్రభుత్వం తరుపున మంత్రి గుమ్మనూర్ జయరామ్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి శ్రీస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా శ్రీభ్రమరాంబికాదేవి సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అశ్వవాహనంపై ఆశీనులై అది దంపతులు పూజలందుకొంటున్నారు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది.
కాగా కర్నూలు జిల్లా, దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం మంగళవారం జరగనుంది. అయితే ఈ ఉత్సవంలో కర్రల సమరంలో హింసను నివారించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులు దేవరగట్టుకు కర్రలు తీసుకెళ్లకుండా ఆలయం చుట్టు పక్కల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వెయ్యి మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిధిలో నైట్ విజన్ సీసీ కెమెరాలు, ఎల్ఈడీ లైట్లు, డ్రోన్స్, వీడియో కెమెరాలతో నిఘా పెట్టినట్లు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు.