Kurnool: లోకేష్ పాదయాత్రలో ఆసక్తికరమైన సన్నివేశం..

ABN , First Publish Date - 2023-04-19T11:15:27+05:30 IST

కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్రలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.

Kurnool: లోకేష్ పాదయాత్రలో ఆసక్తికరమైన సన్నివేశం..

కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం పుప్పలదొడ్డిలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ఓ బుడతడు పసుపురంగు టీషర్టు (Yellow T-shirt)తో ఉత్సాహంగా యాత్రలో అడుగులు వేశాడు. అది గమనించిన లోకేష్ ఆ బాలుడ్ని దగ్గరకు తీసుకొని అప్యాయంగా పలకరించి కుశలప్రశ్నలు వేశారు. అప్పుడే రాజకీయాలు వద్దని.. ముందు మంచిగా చదువుకోవాలని చెప్పి టీషర్టు తీయించి బాలుడికి నచ్చజెప్పి పంపించివేశారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ లబ్ధిపొందేందుకు తహతహలాడుతున్న ఈ రోజుల్లో బాలుడి భవిష్యత్ కోసం దూర దృష్టితో లోకేష్ ఆలోచించారు.

కాగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర మంగళవారం నాటికి 75వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతోంది. ఈరోజు ఉదయం వలగొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. యువనేత పాదయాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. లోకేష్‌తో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు, యువతతో లోకేష్ ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం (TDP Government) వచ్చిన వెంటనే త్వరితగతిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ లోకేష్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం కారుమంచిలో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత భేటీ కానున్నారు.

Updated Date - 2023-04-19T11:15:27+05:30 IST