Nandyala Dist.: శ్రీశైలంలో నవంబర్ 14 నుంచి కార్తీక మాసోత్సవాలు
ABN , First Publish Date - 2023-10-31T09:29:42+05:30 IST
నంద్యాల జిల్లా: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. కార్తీకమాసం నిర్వహణ, భక్తుల ఏర్పాట్లపై ఈవో పెద్దిరాజు సోమవారం అర్చకులతో సమావేశం అయ్యారు.
నంద్యాల జిల్లా: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. కార్తీకమాసం నిర్వహణ, భక్తుల ఏర్పాట్లపై ఈవో పెద్దిరాజు సోమవారం అర్చకులతో సమావేశం అయ్యారు. కార్తీకమాసం శని, అది, సోమ, కార్తీక పౌర్ణమి ఏకాదశి రోజులలో సామూహిక, గర్భాలయా అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వారాలలో భక్తులందరికి శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. రద్దీ రోజులలో అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన రద్దు చేస్తున్నామని, సాధారణలో రోజులలో కూడా సామూహిక, గర్భాలయ అభిషేకాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పారు. కార్తీక దీపారాధనకు భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో ఏర్పాటు చేస్తున్నామని, 27న కార్తీక పౌర్ణమి.. అయిన 26న పౌర్ణమి ఘడియలు రావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.
భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి ఏర్పాట్లు చేపట్టాలని అన్ని విభాగాల అధిపతులను ఆదేశించామని ఈవో తెలిపారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, శుద్ధ, బహుళ ఏకాదశి, ప్రభుత్వ సెలవు రోజులలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆయా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఏర్పాట్లలో భాగంగా భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, స్వామి, అమ్మవార్ల ఆర్జిత సేవలు, ఆలయ వేళలు, కార్తీక సోమవారాల్లో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం, ఆకాశ దీపం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, క్యూలైన్ల నిర్వహణ, రద్దీ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, పార్కింగ్, మొదలైన వాటి గురించి సమావేశంలో చర్చించారు. అలాగే పాతాళగంగ వద్ద శౌచాలయాలు, స్త్రీలు దుస్తులు మార్చుకునే గదులు, క్షేత్ర పరిధిలోని శౌచాలయాలు, జలప్రసాద కేంద్రాలకు అవసరమైన మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని అధికారులకు ఈవో పెద్దిరాజు సూచించారు.