AP News: నంద్యాలలో మంత్రి బుగ్గన అనుచరుల దౌర్జన్యం

ABN , First Publish Date - 2023-05-16T13:16:54+05:30 IST

జిల్లాలోని బేతంచెర్ల మండలంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.

AP News: నంద్యాలలో మంత్రి బుగ్గన అనుచరుల దౌర్జన్యం

నంద్యాల: జిల్లాలోని బేతంచెర్ల మండలంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajenderanath Reddy) అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మైనింగ్ క్వారీకి రస్తా కోసం రైతుల పొలాల్లో కాలినడక రస్తాను వేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 20 అడుగుల మేర వెడల్పు చేసేందుకు పనులను కూడా మొదలుపెట్టారు. అయితే రస్తా వెడల్పు పనులను రైతులు అడ్డుకున్నారు. జేసీబీలు, టిప్పర్లను రానీయకుండా అడ్డుకుని ఆందోళన చేపట్టారు. మద్దిలేటి స్వామి ఆలయ ఛైర్మన్ సీతా రామ చంద్రుడు ఎస్సీ వర్గానికి చెందిన తన అనుచరులతో తమపై దాడికి యత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు. సంఘటనా స్థలానికి 30 మంది రైతులు రావడంతో మంత్రి బుగ్గన అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. మంత్రి బుగ్గన మైనింగ్ క్వారీ కోసం మూడు దారులు ఉన్నప్పటికీ.. తాము టీడీపీ కార్యకర్తలమని తమ పొలాల్లో అక్రమంగా మంత్రి అనుచరులు రస్తా వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-05-16T13:16:54+05:30 IST