Minister Buggana: జనాభా పెరిగే కొద్దీ కాలుష్యం పెరిగిపోతోంది..
ABN , First Publish Date - 2023-08-22T14:56:41+05:30 IST
కర్నూలు: జనాభా పెరిగే కొద్దీ కాలుష్యం పెరిగిపోతోందని.. కాలుష్య నియంత్రణ చాలా అవసరమని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి అన్నారు.
కర్నూలు: జనాభా పెరిగే కొద్దీ కాలుష్యం (Pollution) పెరిగిపోతోందని.. కాలుష్య నియంత్రణ చాలా అవసరమని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి (Minister Buggana Rajendra Nath Reddy) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో రూ. 17 కోట్ల నిధులతో (పోలుష్యన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన నిధులతో) ఈ భవనాన్ని నిర్మించామని, తుంగభద్ర నీరు (Tungabhadra Water) కాలుష్యము కాకుండా మంచి నీటి శుద్ధి ప్లాంటు కోసం కర్నూలు వన్ టౌన్ ప్రాంతానికి రూ. 82 కోట్ల రూపాయలతో ప్లాంట్‌ను ప్రారంభించామన్నారు.
కర్నూలు నగరానికి శాస్వత త్రాగునీరు సమస్యను పరిష్కరించడానికి రూ. 81 కోట్లలతో సుంకేసుల నుంచి ప్రత్యేక పైపు లైన్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బుగ్గన తెలిపారు. 2019లో శిథిలావస్థలో ఉన్న కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాలను 130 కోట్ల రూపాయలతో జగన్నాథ్ గట్టుపై నిర్మాణం చేపట్టామని, శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) నిర్ణయం తీసుకున్నారన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా రోడ్ల నిర్మాణాలు చేపట్టామని, కర్నూలుకు నాలుగు లైన్ల రోడ్లును నిర్మిస్తున్నామని చెప్పారు. ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధి కోసం 9 వేల ఎకరాల భూమిని కేటాయించి, పరిశ్రమలకు నీటిని తరలించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు.