AP NEWS: శ్రీశైలం ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2023-10-09T21:04:43+05:30 IST

శ్రీశైలం ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్‌ను ఎదురెదురుగా ఢీకొంది.

AP NEWS: శ్రీశైలం ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం

నంద్యాల: శ్రీశైలం ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్‌ను ఎదురెదురుగా ఢీకొంది. ఈ సంఘటనలో మోటార్ సైకిల్‌పై శ్రీశైలం వస్తున్న యాత్రికుడి తలకు బలమైన గాయాలు అయ్యాయి. సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు క్షతగాత్రుడిని తరలించారు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉంది. శ్రీశైలానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయాలపాలైన వ్యక్తి వినుకొండకు చెందిన చిలుక జ్యోతిష్కుడు నాగన్నగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2023-10-09T21:04:43+05:30 IST