Lokesh Yuvagalam: యువనేత లోకేష్ ఎదుట టమోటా రైతు ఆవేదన

ABN , First Publish Date - 2023-04-27T11:09:20+05:30 IST

కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) తన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 82వ రోజు కొనసాగుతోంది.

Lokesh Yuvagalam: యువనేత లోకేష్ ఎదుట టమోటా రైతు ఆవేదన

కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) తన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 82వ రోజు కొనసాగుతోంది. గురువారం ఉదయం మంత్రాలయం నియోజవర్గం మాధవరం విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గం మాధవరం శివార్లలో మహిళా రైతు సిద్దాలింగమ్మ యువనేతను కలిసి టమోటా పంటను చూపి గోడు వెళ్లబోసుకుంది. కూలీ ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకున్న మూడెకరాల పొలంలో ఎకరాలో టమోటా, రెండెకరాల్లో చెరకు వేశానని తెలిపింది. ఎకరా టమోటా పంటకు రూ.70వేలు ఖర్చయితే రూ. 10వేలు రాబడి వచ్చిందని కన్నీటిపర్యంతమైంది. కిలో 6రూపాయలు పలుకుతోందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను చేలోనే వదిలివేశానని తెలిపింది.

గత ఏడాది రెండెకరాల్లో మిర్చి పంటవేస్తే 2.5 లక్షల రూపాయల పెట్టుబడి అయిందని, వాగువచ్చి పంట కొట్టుకుపోతే ప్రభుత్వం ఒక్కరూపాయి పరిహారం కూడా ఇవ్వలేదని మహిళా రైతు వాపోయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగితే రూ.70 వేల పంటల బీమా సొమ్ము వచ్చిందని పేర్కొంది. ఏటికేడు నష్టాలతో అప్పులు పెరిగిపోతున్నాయే తప్ప లాభం లేదంది. ప్రభుత్వం సాయం అందించకపోతే వ్యవసాయం చేయడం కష్టమని తెలిపింది.

దీనిపై స్పందించిన లోకేష్ మాట్లాడుతూ...

టమోటా రైతులను ఆదుకోవడానికి కెచప్ ఫ్యాక్టరీలు పెడతానన్న జగన్ పత్తా లేకుండా పోయారని లోకేష్ విమర్శించారు. పంటలబీమాకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీ పెడుతుందని చెప్పి అన్నదాతలను నట్టేట ముంచారని, రైతులు పంటలు నష్టపోతే కనీసం పరిశీలించి అంచనావేసే నాథుడే లేడని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెటింగ్, నిల్వ సౌకర్యం కల్పించి టమోటా రైతులను ఆదుకుంటామని, పంట పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-27T11:09:20+05:30 IST