NCBN Arrest: చంద్రబాబు అరెస్టులో తాజా అప్డేట్ ఇదే.. కాసేపట్లో తీర్పు అనగా కీలక సమాచారం!!
ABN , First Publish Date - 2023-09-10T16:28:16+05:30 IST
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం జడ్జిమెంట్ కాపీ టైపింగ్ అవుతోందని తెలుస్తోంది. జడ్జి తీర్పు వెల్లడించడానికి 20 నిమిషాలపైగా సమయం పడుతుందని సమాచారం.
విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం జడ్జిమెంట్ కాపీ టైపింగ్ అవుతోందని తెలుస్తోంది. జడ్జి తీర్పు వెల్లడించడానికి 20 నిమిషాలపైగా సమయం పడుతుందని సమాచారం. ఇదిలావుండగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు 409 సెక్షన్ వర్తించబోదని కోర్ట్ తెలిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు సెక్షన్ 17Aని కూడా ఏసీబీ కోర్ట్ తిరస్కరించినట్టు సమాచారం. చివరికి చంద్రబాబుకి 41A నోటీసులు ఇచ్చి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్కంఠకు మరికొద్ది సేపట్లోనే తెలియనుంది.
ఇదిలావుండగా ఏసీబీ కోర్ట్ ఇవ్వునున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆదివారం ఉదయం వాదనలు మొదలయ్యాయి. సుదీర్ఘంగా సాగిన ఈ వాదనలు సాయంత్రం 3 గంటల సమయంలో ముగిశాయి. అనంతరం ఏసీబీ కోర్ట్ తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.