Chandrababu live updates : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం విచారణ మంగళవారానికి వాయిదా...

ABN , First Publish Date - 2023-10-13T12:21:31+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు వేర్వేరు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి నేడు (శుక్రవారం) కీలక వాదనలు జరిగాయి. అంగళ్లు అల్లర్ల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్ట్ ఆదేశాలివ్వగా.. సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్‌పైవిచారణ వాయిదాపడింది. వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది.

Chandrababu live updates : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం విచారణ మంగళవారానికి వాయిదా...

Live News & Update

  • 2023-10-13T15:43:00+05:30

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్ట్ తదుపరి విచారణ వాయిదా

    • వచ్చే మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం

    • నేడు సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి

  • 2023-10-13T15:16:00+05:30

    హోరాహోరీగా కొనసాగుతున్న వాదనలు..

    స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును ఆయన ప్రస్తావించారు. చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు పాత చట్టంలోని సెక్షన్స్ వర్తిస్తాయని అన్నారు. చట్టాన్ని రద్దు చేసినా.. వెనక్కి తీసుకున్నా నేరం జరిగినప్పటి చట్టమే వర్తిస్తుందని వాదించారు. కొత్త చట్టం అమలులోకి రాకముందే నేరం జరిగింది కాబట్టి సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదని రోహత్గీ అన్నారు.

    మమ్మల్ని సర్కస్ ఆడిస్తున్నారు: లూథ్రా

    కేసులపై కేసులు పెట్టి తమను సర్కస్‌ ఆడిస్తున్నారని చంద్రబాబు తరపున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అన్నారు. స్కిల్‌ కేసు విచారణకు ఫైబర్‌నెట్‌ కేసుతో సంబంధం ఉందని వాదించారు. మరో కేసులో చంద్రబాబును 16న ప్రవేశపెట్టేందుకు వారెంట్‌ తీసుకున్నారని అన్నారు. ఇక్కడ కూడా 17ఏ ను ఛాలెంజ్‌ చేస్తున్నారా అని లూథ్రాను జస్టిస్‌ త్రివేది ప్రవేశించారు. అవును.. 17ఏ ప్రతిచోటా వర్తిస్తుందని సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ తర్వాత చేస్తామని ధర్మాసనం పేర్కొంది.

    Untitled-6.jpg

  • 2023-10-13T13:15:00+05:30

    సుప్రీంకోర్టులో విచారణ 2 గంటలకు వాయిదా..

    • ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ 2 గంటలకు వాయిదా

    • స్కిల్ కేసులో చంద్రబాబు పిటిషన్ విచారణ సందర్బంగా ఫైబర్ నెట్ కేసునూ విచారిస్తామన్న ధర్మాసనం

    • విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం

    • ఫైబర్‌నెట్ స్కామ్‌లో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు

    • ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించిన బాబు

  • 2023-10-13T12:49:00+05:30

    • మరికొద్ది సేపట్లో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

    • విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం

    • ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు

    • ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించిన బాబు

    • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్న ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూఏథ్రా, అభిషేక్ మను సింఘ్వి

    • సీఐడీ (ఏపీ ప్రభుత్వం) తరఫున ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్, నిరంజన్ రెడ్డి తదితరులు

  • 2023-10-13T12:27:00+05:30

    జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు: నారా బ్రాహ్మణి

    స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో ప్రస్తుతం రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (TDP Chief Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి (Nara Brahmani) ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించడం హృదయవిదారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. చంద్రబాబు క్షేమం గురించి వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేసినందున ఆయనకు తక్షణ వైద్య సహాయం అవసరమన్నారు. చంద్రబాబుకు సకాలంలో వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గడం ఆయన కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి కుటుంబసభ్యులమంతా తీవ్ర ఆందోళన చెందుతున్నామని నారా బ్రహ్మణి ట్వీట్ చేశారు.

    Untitled-4.jpg

  • 2023-10-13T12:16:00+05:30

    టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక్కొక్కటిగా కేసుల్లో ఊరట లభిస్తోంది. అంగళ్లు కేసులో చంద్రబాబుకు నేడు (శుక్రవారం) ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. లక్షరూపాయలు పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కేసులో ఉన్న నిందితులందరూ రూ.లక్ష చొప్పున పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది.

    కాగా.. మొన్న రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలికంగా స్వల్ప ఉపశమనం లభించింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంటుపై విచారణ ప్రక్రియను న్యాయస్థానం ఈ నెల 16 వరకూ నిలుపుదల చేసింది. పీటీ వారెంటు విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. పీటీ వారెంటు విధానంలో తప్ప జ్యుడీషియల్‌ కస్టడీలోఉన్న పిటిషనర్‌ను నేరుగా అరెస్టు చేసే ఉద్దేశం లేదని సీఐడీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ లిఖితపూర్వకంగా సమర్పించిన హామీని న్యాయస్థానం రికార్డుచేసింది. విచారణను16వ తేదీకి వాయిదా వేసింది. ఇక నేడు అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించడంలో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి.

  • 2023-10-13T12:01:00+05:30

    మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు వేర్వేరు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి నేడు (శుక్రవారం) కీలక విచారణలు జరుగుతున్నాయి. అంగళ్లు అల్లర్ల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్ట్ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో మిగతా కేసులో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, వాదనలు, కోర్టు వెలువరించబోయే తీర్పు సర్వత్రా ఉత్కంట నెలకొంది.