Nara lokesh: కియా పరిశ్రమపై జగన్ ప్రసంగం వీడియోను విడుదల చేసిన లోకేష్

ABN , First Publish Date - 2023-03-30T20:08:40+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై మాజీ మంత్రి నారా లోకేష్ (Nara lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara lokesh: కియా పరిశ్రమపై జగన్ ప్రసంగం వీడియోను విడుదల చేసిన లోకేష్

శ్రీసత్యసాయి జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై మాజీ మంత్రి నారా లోకేష్ (Nara lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన ప్రసంగం వీడియోను లోకేష్ విడుదల చేశారు. కియా పరిశ్రమపై పెనుగొండ నియోజకవర్గంలో మాట్లాడిన జగన్‌, కియా పరిశ్రమ కోసం బలవంతంగా అప్పటి ప్రభుత్వం భూములు తీసుకుంటోందంటూ జగన్ చేసిన ప్రసంగం వీడియోను లోకేష్ విడుదల చేశారు. రైతులు ఎవరూ భూములు ఇవ్వవద్దని.. అండగా ఉంటానని నాడు జగన్ హామీ ఇచ్చారని లోకేష్ గుర్తు చేశారు. వచ్చిన కంపెనీలను వెనక్కి పంపి భూములను వెనక్కి ఇస్తానని జగన్‌ చెప్పాడని, ఇవే భూముల్లో కియా పరిశ్రమ వచ్చి వేలాదిమందికి ఉద్యోగాలు వచ్చాయి కదా అంటూ జగన్‌ను లోకేష్ ప్రశ్నించారు.

శ్రీసత్యసాయి జిల్లాలోకి టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Naralokesh YuvaGalam Padayatra) ప్రవేశించింది. గురువారం ఉదయం పెనుగొండలో లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)ను ప్రారంభించారు. 55వ రోజు పాదయాత్ర చేస్తూ కియా పరిశ్రమ వద్దకు చేరుకుని ఆ పరిశ్రమను యువనేత పరిశీలించారు. ఈ సందర్భంగా కియా పరిశ్రమ ముందు లోకేష్ సెల్ఫీ చాలెంజ్ (Lokesh Selfie Challenge) విసిరారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలా పరిశ్రమలు వచ్చాయని అన్నారు. ఈ పరిశ్రమలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని అందుకే ప్రజలు తమకు ఓటు వేయలేదన్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ సెల్ఫీరూపంలో ప్రజల ముందు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కియా పరిశ్రమ (KIA Industry) ముందు లోకేష్ సెల్ఫీ చాలెంజ్ విసిరారు. అప్పటి ప్రభుత్వంలో అనేక పరిశ్రమలను తీసుకువచ్చామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు సేవ చేసిందే తప్ప.. చేసిన అభివృద్ధి పనులను చెప్పుకోలేకపోయామని.. అందుకే ప్రజలు అలాంటి ఫలితాలు ఇచ్చారన్నారు. పాదయాత్రలో దారి వెంబడి వెళ్తుండగా ఉన్న పరిశ్రమల ముందు ఆగి లోకేష్ సెల్ఫీ తీసుకుంటూ ప్రజలకు తెలియజేస్తున్నారు.

Updated Date - 2023-03-30T20:22:42+05:30 IST