Delhi liquor Scam: మాగుంట రాఘవ బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన ఈడీ
ABN , First Publish Date - 2023-06-08T11:33:27+05:30 IST
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ బెయిల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాఘువ బెయిల్‌పై రేపు (శుక్రవారం) విచారించిందుకు సుప్రీం అనుమతి ఇచ్చింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam Case) నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ బెయిల్‌పై (Magunta Raghava) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాఘువ బెయిల్‌పై రేపు (శుక్రవారం) విచారించిందుకు సుప్రీం అనుమతి ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి నిన్న రాఘవకు రెండు వారాల మధ్యంతర బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంలో ఈడీ (ED) సవాలు చేసింది. రేపు విచారణకు స్వీకరించాలని ఈడీ తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ ఏ రాజు (Additional Solicitor General SA Raju) ఉన్నతన్యాయస్థానాన్ని కోరారు. మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్‌కు ఆయన చూపిన కారణాలు సరైనవి కావని ఈడీ పేర్కొంది. ఈ క్రమంలో రాఘవ బెయిల్‌పై రేపు విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ అంగీకారం తెలియజేసింది.
కాగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు నిన్న ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి (Aurobindo Pharma Director Sarath Chandra Reddy) అప్రూవర్‌గా మారిన నేపథ్యంలో రాఘవకు ఉపశమనం లభించినట్లైంది. తన భార్య అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును రాఘవ కోరారు. రాఘవ భార్య హాస్పిటల్ రికార్డుల పరిశీలించిన తరువాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. అయితే రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.