Botsa: రాజధానులపై మంత్రి బొత్స కీలక ప్రకటన

ABN , First Publish Date - 2023-02-16T18:52:37+05:30 IST

అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిందే తమ ప్రభుత్వ విధానం..

Botsa: రాజధానులపై మంత్రి బొత్స కీలక ప్రకటన

అమరావతి: అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy), మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) చెప్పిందే తమ ప్రభుత్వ విధానమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) స్పష్టం చేశారు. ఇప్పటికీ తమ విధానం వికేంద్రీకరణే అని అన్నారు.

విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును సహచర మంత్రులతో కలిసి బొత్స పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో 25 జిల్లాల సమగ్ర అభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. అమరావతి శాసనరాజధాని, విశాఖపట్నం పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయరాజధాని అని మంత్రి బొత్స గురువారం రోజు మరోసారి స్పష్టం చేశారు. ఇదీ ప్రభుత్వ విధానమని, ప్రభుత్వ నిర్ణయమని, ఈ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి చెప్పారు.

అయితే ఇటీవల బొత్స మాట్లాడుతూ ఉగాది నుంచే విశాఖ నుంచి పాలన చేయాలని సీఎం జగన్ పై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. తమ వినతికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్నారు. 2014లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోన టీడీపీ ఓటమి పాలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. అసెంబ్లీలో మూడు రాజధానుల అంశాన్ని జగన్ ప్రకటించారు.

వికేంద్రీకరణతోనే అభివృద్ది సాధ్యమని వైసీపీ సర్కార్ భావిస్తుంది. అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైతే ఉద్యమాలకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని జగన్ సర్కార్ అభిప్రాయంతో ఉంది. దీంతో విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ వార్తలు కూడా చదవండి

****************************************************************

రెండు నెలల తర్వాత ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కొత్తగా 400 రోజుల...

****************************************************************

ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలలో సమూల మార్పులు..

***************************************

Updated Date - 2023-02-16T18:56:22+05:30 IST