Minister Botsa: ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సమావేశం
ABN , First Publish Date - 2023-05-17T16:30:14+05:30 IST
ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో (Teachers unions Representatives) మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) సమావేశమయ్యారు.
విజయవాడ: ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో (Teachers unions Representatives) మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స చర్చించారు. ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే మంత్రి బొత్సతో రెండుసార్లు భేటీ అయ్యారు.
ఇటీవల మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్స్ బదిలీలపై సమీక్షించామని.. త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలలో ఉన్న చట్టాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే అంశంపై పరిశీలిస్తున్నామన్నారు. సీఎం జగన్ దీని పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు.