MLC elections: జైలుకు వెళ్లడానికి సిద్ధపడితేనే దొంగ ఓటుకు వెళ్లండి: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2023-03-07T20:48:07+05:30 IST

అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దొంగ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) సైతం గెలవాలని ప్రయత్నిస్తున్నాడు.

MLC elections: జైలుకు వెళ్లడానికి సిద్ధపడితేనే దొంగ ఓటుకు వెళ్లండి: అచ్చెన్నాయుడు

నెల్లూరు: ‘అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దొంగ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) సైతం గెలవాలని ప్రయత్నిస్తున్నాడు. టీడీపీ తరపున ఇదే హెచ్చరిస్తున్నా. జైలుకు వెళ్లడానికి సిద్ధపడితేనే దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని వదిలే ప్రశ్నేలేదు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) హెచరించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఏ ఎన్నికలను సక్రమంగా జరగనివ్వడం లేదన్నారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలు మొదలు తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికలో సైతం భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో తిరుపతిలో ఏ స్థాయిలో దొంగ ఓట్లు వేయించాడో దేశం మొత్తం చూసిందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలవడం అరుదుగా జరుగుతుందని, ఈ ఎన్నికల్లో మూడు స్థానాల్లో టీడీపీ (TDP) అభ్యర్థులు తొలి ప్రాధాన్యత ఓటుతో గెలువబోతున్నారని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు.

Updated Date - 2023-03-07T20:48:07+05:30 IST