Maoist: మూడు రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెండ్‌ మావోయిస్ట్ రైను అరెస్ట్

ABN , First Publish Date - 2023-02-22T21:12:15+05:30 IST

మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు రైను (Rainu)ను పోలీసులు అరెస్టు చేశారు. లివిటిపుట్టులో 2018లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు

Maoist: మూడు రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెండ్‌ మావోయిస్ట్ రైను అరెస్ట్

పాడేరు: మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు రైను (Rainu)ను పోలీసులు అరెస్టు చేశారు. లివిటిపుట్టులో 2018లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు (Kidari Sarveswara Rao), మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య ఘటనలో కూడా రైను ప్రధాన నిందితుడిగా నిర్ధారించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సమయంలో జనుమూరి శ్రీనుబాబు అలియాస్‌ సునీల్‌ అలియాస్‌ రైనును పోలీసులు పట్టుకున్నారు. ఆయన వద్ద ఒక మందుపాతర, తుపాకీ, పేలుడు సామగ్రితో పాటు విప్లవ సాహిత్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

రైను 2000లో మావోయిస్టు పార్టీలో చేరి ఎల్లవరం, గుర్తేడు, నందపూర్‌ దళాల్లో పనిచేశాడని పోలీసులు తెలిపారు. ఏవోబీలో టెక్నికల్‌ టీమ్‌ సభ్యుడిగా, మావోయిస్టు నేత అక్కిరాజు హరగోపాల్‌ (ఆర్‌కే)కు ప్రొటెక్షన్‌ స్క్వాడ్‌ కమాండర్‌గా, ఏవోబీ మిలటరీ ప్లాటూన్‌ కమాండర్‌గా పనిచేశాడని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ (Andhra Pradesh, Odisha, Chhattisgarh), రాష్ట్రాల్లో రైను అనేక హింసాత్మక ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని, 2018లో డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన ఘటనలో ప్రధాన నిందితుడిగా రైనును పోలీసులు గుర్తించారు. ఆంధ్ర, ఒడిశాతో పాటు ఛత్తీస్‌ఘడ్‌లో రైను మోస్ట్‌ వాంటెండ్‌ మావోయిస్ట్ అని, అతనిపై రూ.5 లక్షల రివార్డు ఉందని పోలీసలు పేర్కొన్నారు. రైనును ఈ రోజు (బుధవారం) కోర్టులో హాజరుపర్చామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-02-22T21:12:16+05:30 IST