Vijayasaireddy: సీబీఐ కోర్టుకు ఎంపీ విజయసాయి వచ్చారు.. వెళ్లారు... ఎందుకంటే?
ABN , First Publish Date - 2023-09-01T11:11:07+05:30 IST
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం ఉదయం సీబీఐ కోర్టుకు వచ్చారు.
హైదరాబాద్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasaireddy) శుక్రవారం ఉదయం సీబీఐ కోర్టుకు (CBI Court) వచ్చారు. విదేశీ పర్యటనకు ఎంపీకి సీబీఐ కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ కోర్టుకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో డిపాజిట్ చేసిన పాస్‌పోర్ట్‌ను తీసుకుని వెళ్లిపోయారు.
కాగా.. విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ (CM Jaganmohanreddy), ఎంపీ విజయసాయిరెడ్డికి (YCP MP) సీబీఐ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రికి న్యాయస్థానం అనుమతించింది. కుమార్తెలను చూడటానికి కుటుంబ సమేతంగా వెళ్లేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ కోర్టును కోరారు. విచారణ అనంతరం ధర్మాసనం సీఎంకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అలాగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా విదేశాలు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్ సింగపూర్ పర్యటనకు విజయసాయిరెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్తున్నట్లు విజయసాయిరెడ్డి కోర్టుకు తెలియజేశారు.