Nara Lokesh: జగన్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని అటకెక్కించారు

ABN , First Publish Date - 2023-04-19T18:01:54+05:30 IST

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM Jaganmohan Reddy) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP National General Secretary Nara Lokesh ) విమర్శలు గుప్పించారు.

Nara Lokesh: జగన్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని అటకెక్కించారు

కర్నూలు: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM Jaganmohan Reddy) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP National General Secretary Nara Lokesh ) విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ప్రజలకు గుక్కెడు నీరందించే నాధుడే కరువయ్యాడని మండిపడ్డారు. టీడీపీ పాలనలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, వైసీపీ వచ్చాక వాటా నిధులను చెల్లించలేక ఆ పథకాన్ని అటకెక్కించిందని లోకేష్ దుయ్యబట్టారు. కేంద్రం నిధులను వినియోగించడంలో విఫలమైందని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేస్తామని యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, కాంపౌండ్ వాల్ నిర్మిస్తామన్నారు.

యువనేత నారా లోకేష్‌ను కారు మంచి గ్రామస్తులు కలిసి వారి సమస్యలను వివరించారు. తమ గ్రామంలో తాగునీటి ఎద్దడి అధికంగా ఉందని, డ్రైనేజీలు లేక మురుగు నీరు రోడ్లపై పారుతోందని, చౌడమ్మ గుడి వద్దనున్న 200 కుటుంబాల్లో ఒక్క ఇంటికీ కుళాయి లేదని లోకేష్ తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు లేవని, ఎంపీపీ పాఠశాలకు ప్రహరీ గోడ లేదని, హైస్కూల్ వద్ద రోడ్డు సదుపాయం లేదని, ప్రహరీగోడ లేదన్నారు. నాయకులు, అధికారులకు సమస్యలను విన్నవించినా ఫలితం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పరిష్కరించాలని లోకేష్‌కు కారు మంచి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-04-19T21:03:06+05:30 IST