Nara Lokesh: ఫైబర్‌ గ్రిడ్, స్కిల్ కేసులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు...

ABN , First Publish Date - 2023-09-29T12:58:09+05:30 IST

అమరావతి ఇన్నిర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసులో ముందస్తు బెయిల్‌పై విచారణ ముగిసిన నేపథ్యంలో ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లోనూ ముందస్తు బెయిల్‌ కోసం నారా లోకేశ్ పిటిషన్ వేశారు. ఈ మేరకు ఆయప తరపున న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.

Nara Lokesh: ఫైబర్‌ గ్రిడ్, స్కిల్ కేసులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు...

అమరావతి: అమరావతి ఇన్నిర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసులో ముందస్తు బెయిల్‌పై విచారణ ముగిసిన నేపథ్యంలో ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లోనూ ముందస్తు బెయిల్‌ కోసం నారా లోకేశ్ పిటిషన్ వేశారు. ఈ మేరకు ఆయప తరపున న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మధ్యాహ్నం 2.15 గంటలకు ఏపీ హైకోర్ట్ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టయ్యారు. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్ కూడా జారీ అయ్యింది. లోకేశ్ పేరును కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారన్న సమాచారంతో ముందస్తు బెయిల్ కోసం న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు.


ఐఆర్ఆర్ కేసులో 41ఏ కింద నోటీసులు ఇస్తామన్న ఏజీ...

ఇన్నిర్ రింగ్ రోడ్ (IRR) అలైన్‌మెంట్ మార్పునకు సంబంధించిన అక్రమ కేసులో ఏపీ హైకోర్టులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ14గా చేర్చిన నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. సీఆర్‌పీసీలోని 41ఏ కింద లోకేష్‌కు నోటీసులు ఇస్తామని ఏజీ అన్నారు. ఈ మేరకు దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్‌లో మార్పు చేశారని కోర్టుకు నివేదించారు. 41ఏ నిబంధనలు పూర్తిగా పాటిస్తామని, విచారణకు సహకరించకపోతే కోర్టు దృష్టికి తీసుకొస్తామని ఏజీ వివరించారు. దీంతో సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్‌ ప్రస్తావన రాదు కాబట్టి ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. దీనినిబట్టి ముందస్తు బెయిల్‌కు ఆస్కారమున్న అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించి ఉండొచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం నిర్ధారణ కావాల్సి ఉంది.

Updated Date - 2023-09-29T13:01:35+05:30 IST