Nara Lokesh : నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ABN , First Publish Date - 2023-10-12T11:55:13+05:30 IST
ఏపీ హైకోర్టులో ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేసును మధ్యాహ్నం 2:15 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది.
అమరావతి : ఏపీ హైకోర్టులో ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేసును మధ్యాహ్నం 2:15 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముందస్తు బెయిల్‌ను గతంలో అక్టోబర్ 12కు హైకోర్టు పొడిగించింది. లోకేష్ ముందస్తు బెయిల్‌పై ఈ నెల 4వ తేదీన హైకోర్టులో విచారణకు రాగా.. 12 వరకూ లోకేష్‌కు ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా... నేడు స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ 17కు వాయిదా పడింది.