Nara Lokesh: నేను అడిగిన ప్రశ్నకు సీఐడీ సమాధానం చెప్పలేదు
ABN , First Publish Date - 2023-10-11T17:47:08+05:30 IST
2వ రోజు టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) సీఐడీ (CID) విచారణ ముగిసింది.
అమరావతి: 2వ రోజు టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) సీఐడీ (CID) విచారణ ముగిసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేశ్‌ను సీఐడీ విచారించింది. 6 గంటలపాటు నారా లోకేశ్‌ను విచారించినట్లు తెలుస్తోంది.
"హైకోర్టు ఒక్క రోజే విచారించాలని చెప్పినా రెండో రోజు కూడా విచారణకు పిలిచారు. సీఐడీ అడిగినందుకు రెండో రోజు హాజరయ్యా. ఈ రోజు 47 ప్రశ్నలు అడిగారు. సంబంధం లేని ప్రశ్నలే పదేపదే అడిగారు. సీఐడీ కొత్తగా ఏమీ అడగలేదు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నాకు, నా కుటుంబసభ్యులకు ఎలాంటి పాత్ర లేదు. ఈ కేసులో మరోసారి ఏమైనా లేఖ ఇస్తారా అని అడిగా. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. 2 రోజుల పాటు నా సమయం వృథా చేశారు." అని లోకేశ్ అన్నారు.
"భువనేశ్వరి డాక్యుమెంట్స్ ఎలా అడుగుతారు?. ఇన్నర్ రింగ్ రోడ్‌పై బాహుబలి సినిమా చూపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌తో నాకు సంబంధం లేదు. ఇన్నర్ రోడ్ కేసు ఆధారాలు ఎక్కడా చూపెట్టడం లేదు. అజేయ కల్లాంరెడ్డి, ప్రేమ్‌చంద్రారెడ్డిపై FIR ఎందుకు పెట్టలేదు?. అజేయ కల్లాం, ప్రేమ్‌చంద్రారెడ్డిని ఎందుకు విచారించలేదు?. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ ఆడిటర్‌ను అడగమని చెప్పా. రెంట్ చెల్లిస్తే క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?. విచారణకు సహకరించలేదని కొన్ని పత్రికలు రాసిన వార్తలపై సీఐడీ అధికారులను ప్రశ్నించా. డీసీ పత్రికలో వచ్చిన వార్తలు అవాస్తవమని సీఐడీ చెప్పింది. సాక్షిలాగా దొడ్డిదారిన షేర్లు కొనలేదు. తెలియకపోతే భారతిరెడ్డిని అడగండి. వాలంటీర్లకు సాక్షి పేపర్ కొనాలని చెప్పింది నిజం కాదా?. సాక్షి పేపర్ వాలీంటర్లు కొనాలంటే ఢిల్లీ హైకోర్టు భారతి, జగన్‌కు నోటీసులు. జగన్ అమర్‌రాజా కంపెనీని వేధించి తెలంగాణకు తరిమేశాడు. రాజమండ్రిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. 10 రూపాయల షేర్ 350కి కొనలేదు." అని లోకేశ్ అన్నారు.