Nara Lokesh : విధ్వంసక పాలనకు సజీవ సాక్షి జైన్ ఇరిగేషన్

ABN , First Publish Date - 2023-05-11T13:39:38+05:30 IST

విధ్వంసక పాలకుడు జగన్ వినాశక చర్యలకు ప్రత్యక్షసాక్షి నందికొట్కూరు నియోజకవర్గం తంగెడంచలో నిలచిపోయిన జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

Nara Lokesh : విధ్వంసక పాలనకు సజీవ సాక్షి జైన్ ఇరిగేషన్

కర్నూలు : విధ్వంసక పాలకుడు జగన్ వినాశక చర్యలకు ప్రత్యక్షసాక్షి నందికొట్కూరు నియోజకవర్గం తంగెడంచలో నిలచిపోయిన జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నేడు యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు అందించడంతోపాటు కరువు సీమలో యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు అప్పట్లో స్వర్గీయ భవర్ లాల్ జైన్ తంగెడంచలో ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చారని నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇందుకోసం 623 ఎకరాల భూమి కూడా కేటాయించారన్నారు. అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర రైతాంగం జీవన స్థితిగతులు మారిపోయేవన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సహకారం లేకపోవడంతో జైన్ ప్రాజెక్టు నిలచిపోయిందన్నారు. సైకో సీఎం వికృత పాలనకు ఇదొక ఉదాహరణ మాత్రమేనని నారా లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-11T13:39:38+05:30 IST