Lokesh: జగన్ పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకున్నా.. భవిష్యత్‌కు గ్యారెంటీతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం

ABN , First Publish Date - 2023-06-30T18:45:37+05:30 IST

గూడూరు నియోజకవర్గంలో నారా లోకేష్ (Lokesh) యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. వరగలి గ్రామస్తులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు.

Lokesh: జగన్ పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకున్నా.. భవిష్యత్‌కు గ్యారెంటీతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం

ఉమ్మడి నెల్లూరు జిల్లా: గూడూరు నియోజకవర్గంలో నారా లోకేష్ (Lokesh) యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. వరగలి గ్రామస్తులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు జగన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం రావడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోట్లు దోచుకున్నాడని వైసీపీ (YCP) నాయకులే చెబుతున్నారని లోకేష్ గుర్తు చేశారు. వాళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళకి టికెట్ ఇస్తున్నామని చెబుతున్నారని, ఆయన చేసిన తప్పులు వైసీపీకి వర్తించవా? అని లోకేష్ ప్రశ్నించారు. తమ దగ్గర దోచుకోవడానికి కిడ్నీలు, రక్తం తప్ప ఏమి మిగలలేదని, జగన్ ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని దెబ్బతీశాడని, డ్రైవర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదన్నారు. గ్రామాల్లో పేదలకు ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని, నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ అందడం లేదని లోకేష్ మండిపడ్డారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని, గ్రామంలో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని లోకేష్ అన్నారు.

''జగన్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాను. మీ కష్టాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. వెయ్యి రూపాయల డివ్యాంగుల పెన్షన్‌ను మూడు వేలు చేసింది చంద్రబాబు. స్కూటర్లు కూడా అందించింది టిడిపి. జగన్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ ఇవ్వడం లేదు. కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు. స్కూటర్లు కూడా ఇవ్వలేదు. రూ.200 వందల పెన్షన్ ని రూ. 2 వేలు చేసింది చంద్రబాబు. జగన్ నాలుగేళ్ల లో పెన్షన్ పెంచింది కేవలం రూ.750 మాత్రమే. రౌడీ చుట్టూ రౌడీలు ఉంటారు. 420ల చుట్టూ 420లు ఉంటారు. 28 కేసుల్లో 420 జగన్. ఏపీ సీఎం జగనే 420...ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు కూడా 420 లే. గూడూరులో సిలికా శాండ్ దోచుకొని ప్రకృతిని విధ్వంసం చేశారు. వీరి అవినీతి వలన ప్రజలపై విపరీతమైన భారం పడుతుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి నేతల అవినీతిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.

చంద్రన్న భీమా ప్రారంబించింది టిడిపి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.5 లక్షలు సహాయం అందించాం. జగన్ ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీగా మార్చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శ్రీని పటిష్ఠ పరుస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పిస్తాం. టిడిపి మహాశక్తి కార్యక్రమాన్ని ప్రకటించింది. ఎన్నికల ముందు జగన్ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు ఇళ్లు కట్టక పోతే స్థలం వెనక్కి లాక్కుంటున్నాడు. మూడు లక్షల పట్టాలు వెనక్కి తీసుకుంది. నాలుగేళ్లుగా జగన్ పాలనలో ప్రజలు నరకయాతన పడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను పెంచి ప్రజల్ని పీడిస్తున్నాడు. ప్రజల కష్టాలు చూసిన తరువాత టిడిపి మహాశక్తి కార్యక్రమాన్ని ప్రకటించింది.'' అని లోకేష్ వెల్లడించారు.

''ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకి రూ.1500 ఇస్తాం.

దీపం పథకం కింద ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.

ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం.

తల్లికి వందనం పేరుతో పిల్లల చదువు కోసం రూ.15 వేలు అందిస్తాం. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు ఇస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం.

ప్రతి నెలా నిరుద్యోగులకు రూ.3 వేలు ఆర్ధిక సహాయం అందిస్తాం.

బిసిల రక్షణ కోసం ప్రత్యేక బిసి రక్షణ చట్టం తీసుకొస్తాం.

అభివృద్ధి, సంక్షేమం సైకిల్ కి రెండు చక్రాలు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. జగన్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలు విభజించింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరున నెల్లూరు జిల్లాలో కలుపుతాం. వరగలి గ్రామంలో సిసి రోడ్లు, ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసింది టిడిపి. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామంలో ఒక తట్ట మట్టి ఎత్తలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ గ్రామాన్ని అభివృద్ది చేస్తాం.'' అని లోకేష్ అన్నారు.

Updated Date - 2023-06-30T18:53:48+05:30 IST