Nara Lokesh : లోకేష్ ఎవ్వరినీ విడిచి పెట్టడం లేదు.. అందరినీ కలుస్తూ..

ABN , First Publish Date - 2023-03-26T08:17:38+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనుకున్నప్పుడు ఆయనేంటి? పాదయాత్ర ఏంటి? అసలు జనంతో మమేకమవగలరా? ఏవైనా సమస్యల గురించి మాట్లాడగలరా? అనే సందేహాలు చాలా మందికి వచ్చాయి.

Nara Lokesh : లోకేష్ ఎవ్వరినీ విడిచి పెట్టడం లేదు.. అందరినీ కలుస్తూ..

అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనుకున్నప్పుడు ఆయనేంటి? పాదయాత్ర ఏంటి? అసలు జనంతో మమేకమవగలరా? ఏవైనా సమస్యల గురించి మాట్లాడగలరా? అనే సందేహాలు చాలా మందికి వచ్చాయి. కానీ నారా లోకేష్ మాత్రం అందరి అంచనాలనూ తల కిందులు చేస్తూ దూసుకెళుతున్నారు. పాదయాత్రలో వారు, వీరు అనేది లేదు. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ.. కలుసుకుని మాట్లాడుతూ వెళుతున్నారు. ప్రతి ఒక్కరి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో ఆయనకు వచ్చిన మైలేజ్ అంతా ఇంతా కాదు.

నారా లోకేష్ పాదయాత్ర వివరాలు :

ఇప్పటి వరకు నడిచిన దూరం 636.1 కి.మీ.

ఈ రోజు నడవబోయే దూరం 11.1 కి.మీ.

8.00 – రామయ్యపేట విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.30 – రామయ్యపేటలో మహిళా ప్రముఖులతో సమావేశం.

10.40 – అల్లపల్లిలో ఆటోవర్కర్లతో భేటీ.

11.20 – గౌనిపల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

12.15 – పగడాలవారిపల్లిలో బిసి సామాజికవర్గీయులతో ముఖాముఖి.

1.15 – పగడాలవారిపల్లిలో భోజన విరామం.

2.30 – భోజన విరామస్థలంలో యువతతో ముఖాముఖి.

సాయంత్రం..

4.00 – యువగళం పాదయాత్ర పెనుగొండ నియోజకవర్గంలోకి ప్రవేశం.

5.00 – గౌనివారిపల్లి (గోరంట్ల మండలం)లో స్థానికులతో మాటామంతీ.

5.35 – కొరెవాండ్లపల్లిలో స్థానికులతో సమావేశం.

6.30 – కొండాపురం పంచాయితీ రెడ్డిచెరువుకట్ట విడిది కేంద్రంలో బస.

Updated Date - 2023-03-26T08:26:47+05:30 IST