Nellore Dist.: కావలి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
ABN , First Publish Date - 2023-07-09T08:07:23+05:30 IST
నెల్లూరు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతోంది. ఆదివారం నాటికి 151వ రోజుకు చేరింది. ఇవాళ బంగారుపాలెం క్యాంపు సైటులో మధ్యాహ్నం 2 గంటలకి బీసీలతో సమావేశమవుతారు.
నెల్లూరు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) కావలి నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతోంది. ఆదివారం నాటికి 151వ రోజుకు చేరింది. ఇవాళ బంగారుపాలెం క్యాంపు సైటులో మధ్యాహ్నం 2 గంటలకి బీసీలతో సమావేశమవుతారు. సాయంత్రం 5:45 గంటలకు జువ్వలదిన్నెలో పొట్టిశ్రీరాములు గృహం సందర్శిస్తారు. తర్వాత 7:15 గంటలకు అన్నగారిపాలెంలో స్థానికులతో లోకేశ్ భేటీ అవుతారు.
ఈ రోజు బంగారుపాలెం నుంచి వడ్డిపాలెం, జువ్వలదిన్నె, చిప్పలేరు, ఆదినారాయణపురం, అన్నగారిపాలెం, ఒట్టూరు క్రాస్ రోడ్డు, నడింపల్లి క్రాస్ రోడ్డు, మామిళ్లదొరువు, పూలదొరువు, చిననట్టు, పెదనట్టు క్రాస్ రోడ్ మీదుగా తుమ్మలపెంట వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. కాగా ఇప్పటి వరకు లోకేష్ 150 రోజుల్లో 1968.9 కి.మీ దూరం మేర పాదయాత్ర పూర్తి చేశారు.
కాగా లోకేష్ తన పాదయాత్రలో మహిళలు, యువత, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని.. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకి ఇరువైపులా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను యువనేత తెలుసుకున్నారు. చెత్త పన్ను, బోర్డు పన్ను, ప్రోఫిషనల్ ట్యాక్స్ అంటూ వ్యాపారస్తులను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తమపై భారం తగ్గించాలంటూ లోకేష్‌ను వ్యాపారస్తులు కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గిస్తామని.. దాని ప్రభావం అన్ని రంగాల మీద ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ అడ్డగోలుగా పెంచేసిన పన్నులు అన్ని తగ్గిస్తామన్నారు. విద్యుత్ ఛార్జీలపై పెంచిన భారాన్ని కూడా తగ్గిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.