MLA Kotam Reddy: ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి..

ABN , First Publish Date - 2023-04-16T12:27:08+05:30 IST

నెల్లూరు జిల్లా: నగరంలో ఎన్టీఆర్ నక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ పనులు పూర్తి అయితే నెల్లూరు ఆధ్యాత్మిక, సుందరంగా తయారు అవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

MLA Kotam Reddy: ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి..

నెల్లూరు జిల్లా: నగరంలో ఎన్టీఆర్ నక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ పనులు పూర్తి అయితే నెల్లూరు ఆధ్యాత్మిక, సుందరంగా తయారు అవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ హయాంలో చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పొంగురు నారాయణ ప్రోత్సాహంతో పనులు ప్రారంభం అయ్యాయన్నారు. దీనికి రూ.17.55 లక్షల నిధులు కేంద్ర అమృత్ పథకం కింద మంజూరు చేయించారని, ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయని అన్నారు.

మూడు సంవత్సరాల పోరాటం తరువాత వైసీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, టెండర్లు పిలిచి ఆరు నెలలు అయినా, ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీనికి సంబంధించి నుడా వీసీకి లేఖ రాసినట్లు చెప్పారు. 15 రోజుల్లో పనులు ప్రారంభం కాకుంటే, నుడా కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రతి దేవస్థానానికి వెళ్లి భక్తుల సహాకారం కొరతామని చెప్పారు. దర్గా అభివృద్ధికి నిధులు మంజూరు కావడం ముస్లిం విజయం అని చెప్పానని.. అది అధికార పార్టీకి నచ్చినట్టు లేదన్నారు. తన మూడేళ్ల పోరాటం తరువాత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. రూరల్ సమస్యలపై పోరాటంతో సాధించుకుంటే వైసీపీ నేతలకి ఉలుకెందుకని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2023-04-16T12:27:08+05:30 IST