Nara Lokesh: వైసీపీ పాలనలో యానాది కార్పొరేషన్ నిర్వీర్యం..
ABN , First Publish Date - 2023-07-07T16:41:33+05:30 IST
నెల్లూరు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాజుపాలెంలో యానాదులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
నెల్లూరు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాజుపాలెంలో యానాదులతో ముఖాముఖి కార్యక్రమం (Face-to-Face Program) నిర్వహించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ యానాది సోదరుల అభివృద్ధికి టీడీపీ (TDP) కృషి చేసిందని, వైసీపీ పాలనలో (YCP Govt.) యానాది కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే తిరిగి యానాది కార్పొరేషన్‌ను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఎస్టీ గురుకుల పాఠశాలలు తిరిగి బలోపేతం చేస్తామన్నారు. అలాగే పెళ్లి కానుక పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని లోకేష్ చెప్పారు.
2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 50 సంవత్సరాలు దాటిన యానాది సామాజిక వర్గానికి పెన్షన్ ఇచ్చామని లోకేష్ చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి సీఎం జగన్ మోసం చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. ఐటీడీఏకు ఐఎఏస్ ఆఫీసర్‌ను నియమిస్తామని, యానాదులకు పక్క ఇళ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. పేదలు శాశ్వతంగా పేదరికంలోనే ఉండాలన్నది వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ విమర్శించారు.