Viral News : ఎంజాయ్ చేసేందుకు బోటులో సముద్రంలోకి వెళ్లిన యువకులకు షాకులే షాకులు..

ABN , First Publish Date - 2023-02-08T10:27:08+05:30 IST

హాయిగా ఎంజాయ్ చేద్దామని 9 మంది యువకులు సముద్రం దగ్గరకు వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఊరికే ఉంటారా? సముద్రంలోకి వెళ్లాలని తమ ఎంజాయ్‌మెంట్‌కు మరింత జోష్ ఇవ్వాలని భావించారు. జోష్ మాటేమో కానీ.. సముద్రంలోకి వెళ్లాక షాకుల మీద షాకులు తగిలాయి.

Viral News : ఎంజాయ్ చేసేందుకు బోటులో సముద్రంలోకి వెళ్లిన యువకులకు షాకులే షాకులు..

కావలి (నెల్లూరు జిల్లా) : హాయిగా ఎంజాయ్ చేద్దామని 9 మంది యువకులు సముద్రం దగ్గరకు వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఊరికే ఉంటారా? సముద్రంలోకి వెళ్లాలని తమ ఎంజాయ్‌మెంట్‌కు మరింత జోష్ ఇవ్వాలని భావించారు. జోష్ మాటేమో కానీ.. సముద్రంలోకి వెళ్లాక షాకుల మీద షాకులు తగిలాయి. ఒక్కసారిగా నిస్సహాయత... ఏం చేయాలో పాలు పోలేదు. తక్షణమే మొబైల్స్‌కు పని చెప్పారు. ఎట్టకేలకు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరి సముద్రంలోకి వెళ్లాక అసలు ఏం జరిగింది? వారికి తగిలిన షాకులేంటి?

కావలి రూరల్ మండలం చెన్నాయపాలెం సముద్ర తీరం నుంచి సముద్రంలోకి విహరించేందుకు బోటులో 9 మంది యువకులు బయలు దేరారు. సముద్రంలోకి దాదాపు రెండు కిలో మీటర్లు వెళ్లాక వారు ప్రయాణిస్తున్న బోటు మరమ్మతులకి గురైంది. బోటు డ్రైవర్ ఏమైనా పరిష్కార మార్గం సూచిస్తాడా? అంటే మద్యం మత్తులో ఉన్నాడు. మొత్తానికి యువకులు నిస్సహాయంగా మారిపోయారు. అప్పుడు యువకుల పరిస్థితిని పవన్ కల్యాణ్ స్టైల్లో చెప్పాలంటే.. ఒడ్డేమో దూరం.. అసలే చుట్టూ సముద్రం, డ్రైవర్ చూస్తే మద్యం మత్తులో జోగుతున్నాడు. బోటేమో రిపేరు.. ఒడ్డుకు చేరే మార్గం లేదు కాని చేతిలో కొండంత అండగా మొబైల్ ఉంది.

ఇప్పట్లో ఒక్కొక్కరి దగ్గర రెండేసి మొబైల్స్ ఉంటున్నాయి. ప్రపంచంలో ఏ దిక్కుకు వెళ్లినా సిగ్నల్ ఉన్నంత వరకూ ఎలాగైనా నెట్టుకు రావచ్చు. ఆ యువకులు సైతం అదే చేశారు. డయల్ 112కి కాల్ చేయడంతో కావలి రూరల్ పోలీసులు స్పందించారు. సిబ్బందితో వెళ్లి యువకులని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మొత్తానికి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నందుకు యువకులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2023-02-08T20:47:05+05:30 IST