Nellore Dist.: వైసీపీ కీలక నేత సస్పెండ్
ABN , First Publish Date - 2023-04-04T11:06:00+05:30 IST
నెల్లూరు జిల్లా: వైసీపీలో సస్పెన్షన్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. కావలిలో వైసీపీ కీలక నేత మన్నెమాల సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ అధిష్టానం లేఖను విడుదల చేసింది.
నెల్లూరు జిల్లా: వైసీపీ (YCP)లో సస్పెన్షన్ (Suspension)ల పర్వం కొనసాగుతూనే ఉంది. కావలిలో వైసీపీ కీలక నేత మన్నెమాల సుకుమార్ రెడ్డి (Mannemala Sukumar Reddy)ని సస్పెండ్ చేస్తూ అధిష్టానం లేఖ (Letter)ను విడుదల చేసింది. ఇటీవల తనపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (Ramireddy Pratap Kumar Reddy) వెల్లడించారు. ఇటీవల కాలం వరకు సుకుమార్ రెడ్డి కావలిలో అంతా తానై వ్యవహరించారు. కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేను ప్రశ్నించడం, ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండడం.. ఆర్థిక లావాదేవీల్లో గొడవల కారణంగా చర్చలు సాగుతున్నాయి. వరుస సస్పెన్షన్‌లతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.
నెల్లూరు జిల్లాలో ఇటీవల ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే ఓటు వేయలేదనే కారణంగా ఆనం రామనారాయణ రెడ్డి (Anam Rama Narayana Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy)లను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఇది జరిగి నెల రోజులు కాకముందే కావలిలో కీలకంగా వ్యవహరించే సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ అధిష్టానం లేఖ విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందునే సస్పెండ్ చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. సుకుమార్ రెడ్డి కావలిలో అంతా తానై వ్యవహరించారు. ఇక్కడ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డా? లేక సుకుమార్ రెడ్డా? అనే అనుమానాలు వచ్చే విధంగా ఈయన ఒక షాడో ఎమ్మెల్యేలా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, సుకుమార్ రెడ్డిల మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. దీంతో అధిష్టానం సుకుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వైసీపీ శ్రేణులు అయోమయానికి గురయ్యారు.