NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. చండ్ర నర్సింహులు అరెస్ట్
ABN , First Publish Date - 2023-10-02T20:52:33+05:30 IST
మంచింగుపుట్టు కుట్ర కేసులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల ఎన్ఐఏ బృందాలు సోదాలు చేసింది.
అమరావతి/ హైదరాబాద్: మంచింగుపుట్టు కుట్ర కేసులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల ఎన్ఐఏ బృందాలు సోదాలు చేసింది. ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు చండ్ర నర్శింహులు అరెస్ట్ చేశారు. సత్యసాయి జిల్లాలోని నర్సింహులు నివాసంలో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కడపలో మావోయిస్టు సానుభూతిపరుడి నుంచి 14 లక్షలు, డాక్యుమెంట్లు విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, పల్నాడు, విజయవాడ, రాజమండ్రి, ప్రకాశం, బాపట్ల, ఏలూరు,తూర్పు గోదావరి, కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, కడప, సత్యసాయి, అనంతపురం,కర్నూలు జిల్లాలలో సోదాలు చేశారు.
తెలంగాణలో ....
తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్నగర్ హన్మకొండ, రంగారెడ్డి , ఆదిలాబాద్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. నిషేదిత మావోయిస్టు పార్టీ అనుబంద సంఘాలు సీఎల్సీ, అమరుల బంధు మిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం, కులనిర్మూలనన పోరాట సమితి, పాట్రియాటిక్ డెమోక్రెటిక్ మూమెంట్, ప్రగతిశీల కార్మిక సంఘం, ప్రజాకళా మండలి, రివల్యూషనరి రైటర్స్ అసోసియేషన్, విరసం, హ్యుమన్ రైట్స్ ఫోరం, రాజకీయ ఖైధీల విడుదల కమిటీ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ సభ్యుల కార్యాలయాలు, ఆయా నేతల ఇళ్లలో ఎన్ఐఏ తనఖీలు చేపట్టింది.