Ramakrishna: రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఎండగట్టాలి...

ABN , First Publish Date - 2023-08-13T14:05:20+05:30 IST

ప్రకాశం జిల్లా: అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలని, అసెంబ్లీ, పార్లమెంట్‌లోకి సామాన్య ప్రజలు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.

Ramakrishna: రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఎండగట్టాలి...

ప్రకాశం జిల్లా: అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలని, అసెంబ్లీ, పార్లమెంట్‌లోకి సామాన్య ప్రజలు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం ప్రకాశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోటీశ్వర్లు, కార్పోరేట్ శక్తులు మాత్రమే చట్టసభల్లోకి వెళ్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు పెట్టకుండా పోలీసులు, కార్యకర్తల్ని అడ్డంపెట్టుకుని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్తే పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ కార్యకర్తలు రాళ్ళు వేశారని, తిరిగి చంద్రబాబుపైనే 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారని మండిపడ్డారు. జీవో నెంబర్ 1ని హైకోర్టు కొట్టివేసినా రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఎండగట్టాలని రామకృష్ణ అన్నారు.

ఏపీలో అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని, దీనిపై ప్రజల్లో చర్చ జరగాలని రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. రుషికొండకు సీఎం జగన్ గుండుకొట్టించారన్నారని, ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే పరిస్థితులు ఇలాగే ఉంటాయన్నారు. విశాఖ నగరంలో వేల కోట్ల ఆస్తులు, భూములు కబ్జా అవుతున్నాయని, కబ్జాల్లో అధికార పార్టీ నాయకులు పాల్గొంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే దొంగలు చేరారని, సీఎం కార్యాలయంలో దొంగలు పడ్డారని పోలీసు అధికారే చెప్పారన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో దొంగతనంపై సీఎం నోరు విప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దొంగలు రాజ్యం ఏలుతున్నారని, తిరుమల కొండపై భద్రత కల్పించాల్సిన బాధ్యత టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-08-13T14:05:20+05:30 IST