AP Crime: సాఫ్ట్‌వేర్ రాధ హత్య కేసులో ఎన్నో ట్విస్ట్‌లు.. చివరకు నిందితుడు ఎవరో తెలిసి కుటుంబసభ్యుల షాక్!

ABN , First Publish Date - 2023-05-22T13:27:16+05:30 IST

జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధ హత్య కేసులో ఎన్నో ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి.

AP Crime: సాఫ్ట్‌వేర్  రాధ హత్య కేసులో ఎన్నో ట్విస్ట్‌లు.. చివరకు నిందితుడు ఎవరో తెలిసి కుటుంబసభ్యుల షాక్!

ప్రకాశం: జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధ హత్య కేసులో ఎన్నో ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. స్నేహితుడే హత్య చేశాడని అంతా అనుకుంటూ ఉండగా.. పోలీసుల దర్యాప్తులో అసలు నిందితుడు ఎవరో తెలిసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఈనెల 17న వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడులో జరిగిన సాఫ్ట్‌వేర్ మహిళ రాధ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ మలిక గార్గ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ.. రాధను ఆమె భర్త మోహన్ రెడ్డి హత్య చేసినట్టు అంగీకరించాడన్నారు.

రాధ హత్య కేసులో ఆమె తండ్రి ఫిర్యాదు ఇచ్చిన వెంటనే పోలీసులు రెస్పాండ్ అయ్యారని.. రాధ ఫోన్ నంబర్ ట్రేస్ చేసి ఘటనా స్థలాన్ని గుర్తించామన్నారు. రాధ మృతదేహాన్ని పరిశీలించి హత్య జరిగినట్లు నిర్ధారించుకున్నామని తెలిపారు. హత్య కేసును ట్రేస్ చేసేందుకు 8 టీమ్‌లను ఏర్పాటు చేశామని.. రాధ ఫోన్‌లో కొన్ని ఆధారాలు దొరికాయన్నారు. రాధ స్నేహితుడు కాశిరెడ్డి డబ్బులు అప్పుగా తీసుకుని ఇవ్వలేదని చెప్పారని.. కాశిరెడ్డి డబ్బులు ఇవ్వకపోవడంతో కుటుంబంలో గొడవలు మొదలైనట్లు చెప్పారు. అయితే కేసు విచారణలో ఆమె భర్త మోహన్ రెడ్డిని అనుమానించామని ఎస్పీ తెలిపారు.

prakasam-radha.jpg

‘‘ఫేక్ ఫోన్ నంబర్ తీసుకుని రాధకు కాశిరెడ్డి కొత్త నంబర్ అంటూ వాట్సాప్ మెసేజ్ చేశాడు.. ఆ నంబర్ కాశిరెడ్డి దే అని నమ్మించాడు. హైదరాబాద్‌లో ఓ రెంట్ కారు తీసుకుని హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చి ఫేక్ నంబర్ ప్లేట్ వేయించాడు. ఒంగోలు నుంచి కనిగిరి వెళ్ళి రాధకు కనిగిరి వస్తే డబ్బులు ఇస్తానని మెసేజ్ చేసాడు. రాధ కనిగిరి వచ్చిన తర్వాత ఆమెను కారులో ఎక్కించుకుని శివారు ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. కారు వెనుక సీటులో ఆమె చున్నీతో మెడకు బిగించి చంపేశాడు. కనిగిరి నుంచి వెలిగండ్ల తీసుకు వెళ్లి రోడ్డు మీద పడుకోబెట్టి కారుతో తొక్కించాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రించే ప్రయత్నం చేశాడు. రాధతో సంతోషంగా లేకపోవటం వల్లే హత్య చేసినట్లు మోహన్ రెడ్డి అంగీకరించాడు. రాధను హత్య చేయాలని పక్కాగా ప్లాన్ చేసాడు. హత్యలో మోహన్ రెడ్డి ఒక్కడే పాల్గొన్నాడు’’ అని ఎస్పీ మలిక గార్గ్ వెల్లడించారు.

Updated Date - 2023-05-22T14:43:49+05:30 IST