Prattipati Pullarao: సీఎం జగన్ ప్రజారవాణా వ్యవస్థను నాశనం చేశారు
ABN , First Publish Date - 2023-11-07T13:36:27+05:30 IST
పల్నాడు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజారవాణా వ్యవస్థను అన్నివిధాలా నాశనం చేశారని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఎన్నో దశాబ్దాల నుంచి ప్రజల్లో పెంచుకున్న నమ్మకాన్ని ఆర్టీసీ కోల్పోతోందన్నారు.
పల్నాడు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ప్రజారవాణా వ్యవస్థను అన్నివిధాలా నాశనం చేశారని, టీడీపీ సీనియర్ నేత (TDP Senior Leadder), మాజీమంత్రి (Ex Minister) ప్రత్తిపాటి పుల్లారావు (Prattipati Pullarao) విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల నుంచి ప్రజల్లో పెంచుకున్న నమ్మకాన్ని ఆర్టీసీ (RTC) కోల్పోతోందన్నారు. ఆర్టీసీ దుస్థితికి విజయవాడ ప్రమాదం ఒక ఉదాహరణ మాత్రమేనని, ఆర్టీసీ బస్సెక్కితే క్షేమంగా గమ్యం చేరతామన్న నమ్మకం పోయిందన్నారు. 2 వేలకుపైగా డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు.
తుక్కుదశకు చేరిన బస్సులు జగనన్న రోడ్ల దెబ్బకు కుదేల్ అవుతున్నాయని, నట్లు, బోల్టులు వంటి చిన్నచిన్న అవసరాలకు ఆర్టీసీ వద్ద డబ్బుల్లేని దుస్థితి నెలకొందని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ ప్రభుత్వం అనాలోచిత, దుర్మార్గమైన విధానాలతో ఆర్టీసీ నష్టపోతోందని దుయ్యబట్టారు. అన్నింటిపై తన పేరు, పోటో వేసుకోవడం తప్ప చేసింది సున్నా అని, ప్రచార ఆర్భాటం తప్ప జగన్ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. కేంద్రం నిధులు ఆపేయడంతో నిజాలు బయటకు వస్తున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడం తప్ప జగన్ చేసిందేమీ లేదని, కేంద్రం నిధులనే అటు ఇటూ మళ్లిస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు. జగన్ పిచ్చి చేష్టలతో రూ. 4 వేల కోట్లు కేంద్రం నిధులు ఆగిపోయాయని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.