Prakasam Dist.: మార్కాపురం వైసీపీ నేతలతో విజయసాయి భేటీ

ABN , First Publish Date - 2023-09-12T15:56:52+05:30 IST

ప్రకాశం జిల్లా: ఒంగోలులో మార్కాపురం వైసీపీ నాయకులతో రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

 Prakasam Dist.: మార్కాపురం వైసీపీ నేతలతో విజయసాయి భేటీ

ప్రకాశం జిల్లా: ఒంగోలు (Ongole)లో మార్కాపురం వైసీపీ నాయకుల (YCP Leaders)తో రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి (Peddireddy Suryaprakash Reddy) పాల్గొన్నారు. అయితే ఆయనను సమావేశం నుంచి బయటకు పంపాలని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి (MLA Nagarjuna Reddy) వర్గం నినాదాలు చేసింది. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిపై సూర్యప్రకాష్ రెడ్డి గత కొంత కాలంగా భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో నాగార్జున రెడ్డి వర్గీయులపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ముందు హీరోల్లా ఫోజులు కొట్టొద్దంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2023-09-12T15:56:52+05:30 IST