Roja : రజినీకాంత్‌ను నేను విమర్శించలేదు
ABN , First Publish Date - 2023-09-04T13:11:41+05:30 IST
తిరుమల శ్రీవారిని నేడు ఏపీ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను తాను విమర్శించలేదన్నారు.
తిరుమల : తిరుమల శ్రీవారిని నేడు ఏపీ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను తాను విమర్శించలేదన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందన్నామని రోజా తెలిపారు. ‘చంద్రబాబుకి ఓటు వేసి గెలిపించండి.. ఏపీని ఇండియాలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకొస్తారు’ అని రజనీకాంత్ చెప్పడాన్ని ఖండించానన్నారు.14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు.
చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడితే.. రజనీకాంత్ ఇమేజ్ తగ్గుతుందన్నారు. తమిళనాడులో ఎవరినో ఉద్దేశించి రజనీకాంత్ మాట్లాడితే దానిపై జనసైనికులు, టీడీపీ వాళ్లు కలిసి ట్రోల్స్ చేశారని రోజా అన్నారు. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డు.. ఓటర్ కార్డు..ఇల్లు కానీ లేదన్నారు. హైదరాబాదు నుంచి అప్పుడప్పుడు వచ్చి వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నాడన్నారు. లోకేష్..ఊరు..ఊరికి పోయి మొరుగుతున్నాడన్నారు. ప్రతి ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తూన్నాడన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీని తీసుకొని పవన్ కళ్యాణ్ ఊగిపోతూ.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ తో వైసీపీపై విమర్శలు చేస్తున్నారని రోజా విమర్శించారు.