Sajjala: కోర్టు విచారణలో చంద్రబాబు తప్పు చేయలేదని ప్రూ చేసుకోవచ్చు
ABN , First Publish Date - 2023-10-11T17:09:05+05:30 IST
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అరెస్ట్ అయ్యి నెల రోజులు దాటిందని, స్కామ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్ట్ రిమాండ్ కి పంపించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు.
అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అరెస్ట్ అయ్యి నెల రోజులు దాటిందని, స్కామ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్ట్ రిమాండ్ కి పంపించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు.
"చంద్రబాబు కేసులో అరెస్టు ప్రోటో కాల్ ప్రకారం చేయలేదు ఇది చెల్లదు అంటున్నారు. స్కిల్ డవలప్‌మెంట్ కేసులో నేరం జరగలేదు అని చెప్పడం లేదు. చంద్రబాబు తాను సీఎం గా ఉంటూ రూ. 300 కోట్లకుపై నేరుగా జేబులో పెట్టకున్నారు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈడీ కూడా స్కిల్ కేసులో నలుగురిని అరెస్ట్ చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని సీఐడీ విచారణ చేసి అరెస్ట్ చేసింది. చంద్రబాబు కేసు విచారణ జరగకుండా క్వాష్ పిటిషన్ వేసి కేసు కొట్టేయించాలని చూస్తున్నారు. టిడ్కో ఇళ్లలో ఐటీ నోటీసులు ఇస్తే ఇక్కడా కేసు మీ పరిధిలోకి రాదని చంద్రబాబు వాదిస్తున్నారు. టిడ్కో కేసులో చంద్రబాబు తరుపున డబ్బులు తీసుకున్న వ్యక్తులు పెండ్యాల శ్రీనివాస్, కీలరి రాజేష్ అని ఐటీ ఆధారాలతో సహా బయట పెట్టింది. స్కిల్ స్కాంలో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు. స్కిల్ స్కాంపై మాట్లాడకుండా 17ఏపై మాట్లాడుతున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు. చంద్రబాబు సంతకాలు ఉన్నాయి. కోర్ట్ విచారణలో చంద్రబాబు తప్పు చేయలేదని ప్రూ చేసుకోవచ్చు.
చంద్రబాబు తప్పులపై ప్రజా కోర్టులో త్వరలో తేలుతుంది. స్కాం జరిగింది చంద్రబాబు హయాంలో... స్కామ్ జరిగినప్పుడు అయినా విచారణ జరపాల్సింది. చంద్రబాబు దృష్టికి స్కిల్ స్కామ్ వచ్చినప్పుడు సీబీఐకి ఎందుకు అప్పగించలేదు. చంద్రబాబు క్వాష్ నిలబడదు. చంద్రబాబు పట్ట పగలు దోపిడీ చేశారు. ఖజానా కొల్ల గొట్టారు. టీడీపీ వాళ్ళు కూడా మద్దతుగా రావడానికి సిగ్గు పడుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ లేని దానికి కుట్ర ఏముంది అని లోకేష్ అంటున్నారు. అక్కడే హెరిటేజ్ భూములు ఎందుకు కొన్నారు. లింగమనేని గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉన్నారు. చంద్రబాబు నన్ను ఎవరు అడుగుతారు అని అహకరంతో స్కాం చేశారు.." అని సజ్జల విమర్శించారు.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరిపై సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.
"పురంధరేశ్వరి పేరుకు బీజేపీ అయినా టీడీపీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా చంద్రబాబుకు అండగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న, బీజేపీలో ఉన్న పురంధరేశ్వరి చంద్రబాబు కోసం పని చేస్తున్నారు. పురందేశ్వరి టీడీపీకి అవసరం అయినప్పుడు అవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. మద్యంపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరడం విచిత్రంగా ఉంది. సొంత అజెండా కోసం వెళ్లారు. పైకి మరొకటి చెబుతున్నారు." అని సజ్జల మండిపడ్డారు.
"డబ్బులు కొట్టేసిన వాడే ధర్మకర్త అయితే ఎలా ఉంటుంది. చంద్రబాబుపై కక్ష సాధించాల్సిన అంత సీన్ ఆయనకు ఉందా?. ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబును ఆర్రెస్టు చేస్తే మాకు ఏం వస్తుంది. చంద్రబాబు ఇంకా నాలుగు సభలు పెడితే మాకు నాలుగు ఓట్లు వస్తాయి. లోకేష్ ఢిల్లీలో కూర్చునే బదులు ప్రజల్లో తిరగ వచ్చు కదా." అని సజ్జల ప్రశ్నించారు.