Sajjala On Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల స్పందన..

ABN , First Publish Date - 2023-07-06T21:15:14+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు (early elections) జరుగుతాయన్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పందించారు.

 Sajjala On Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల స్పందన..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు (early elections) జరుగుతాయన్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పందించారు. షెడ్యూల్ ప్రకారమే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సజ్జల స్పష్టం చేశారు.

''ముందస్తు ఎన్నికలంటూ కొన్ని పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు చేసే హడావిడి. మాకు సంబంధించిన వరకు ఐదేళ్లు ఆఖరి రోజు వరకు పూర్తిగా వినియోగించుకుంటాం. వైసీపీకి పూర్తి సమయం అవసరం...ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా నిర్మాణాత్మకంగా వెళ్తున్నారు. సానుకూల ఫలితాలు వస్తున్నాయి. ముందస్తు ఎన్నికలంటే మా దగ్గర సమాచారం నుంచి వస్తుంది. పవన్‌ను ఒప్పించుకోవడానికా ముందస్తు ప్రచారం. జగన్ పాజిటివ్ ఓటును మాత్రమే నమ్ముకున్నారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. రాష్ట్ర వాటాతో పనులు జరుగుతాయి. ఇళ్ల స్థలాలు ఇచ్చింది.. ఆడుకోవడానికా.. రాజధాని ప్రాంతంలో ఇళ్ళు కట్టద్దు అని కోర్టు చెప్పలేదు.'' అని సజ్జల అన్నారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై సజ్జల స్పందిస్తూ.. ఒకసారి పార్టీ పెట్టాక ఆమె ఇష్టమని, ఆమె నిర్ణయం ఆమెది అని అన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆమె ఇష్టమని సజ్జల స్పష్టంగా చెప్పారు.

Updated Date - 2023-07-06T21:25:14+05:30 IST