Siddharth Luthra : చంద్రబాబును జైల్లో ఉంచడం సరికాదంటూ సిద్దార్థ్ లూద్రా సంచలనం
ABN , First Publish Date - 2023-09-11T12:01:51+05:30 IST
ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదనలు వినిపించేందుకు వచ్చిన సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణ హాని ఉందంటూ ఆయన సంచలనానికి తెరదీశారు.
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదనలు వినిపించేందుకు వచ్చిన సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణ హాని ఉందంటూ ఆయన సంచలనానికి తెరదీశారు. అసలు చంద్రబాబును జైల్లో ఉంచడం సరికాదన్నారు. నేడు సిద్దార్థ్ లూథ్రా మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో భాగంగా పై వ్యాఖ్యలు చేశారు. నేడు చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై తమ వాదనలు వినిపిస్తామన్నారు. గతంలో వెస్ట్ బెంగాల్‌కు చెందిన మంత్రుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావిస్తామని వెల్లడించారు. ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నామని సిద్దార్థ్ లూద్రా తెలిపారు.