Share News

Somireddy : ఆ రెండు సంస్థలకూ పుట్టిన విష పుత్రిక ఇండో సోల్

ABN , First Publish Date - 2023-10-26T12:36:23+05:30 IST

విద్యుత్ రంగంలో జగన్ ప్రభుత్వం భారీ స్కాంలకు పాల్పడుతోందంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పవర్ సెక్టారులో స్కాంలో సీక్వెల్‌ను ప్రభుత్వం తెర లేపిందని తెలిపారు.

Somireddy : ఆ రెండు సంస్థలకూ పుట్టిన విష పుత్రిక ఇండో సోల్

అమరావతి : విద్యుత్ రంగంలో జగన్ ప్రభుత్వం భారీ స్కాంలకు పాల్పడుతోందంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పవర్ సెక్టారులో స్కాంలో సీక్వెల్‌ను ప్రభుత్వం తెర లేపిందని తెలిపారు. పవర్ స్కాంలని పార్టులు పార్టులుగా బయట పెడతామన్నామన్నారు. రూ.7 వేల కోట్ల స్మార్ట్ మీటర్ల కుంభకోణాన్ని తాము బయటపెట్టామని సోమిరెడ్డి తెలిపారు. స్మార్ట్ మీటర్ల కుంభకోణంపై హైకోర్టులో పిల్ వేశానని త్వరలో విచారణకు రాబోతోందన్నారు. అరబిందో.. షిర్డీ సాయి అనేవి జగన్‌కు దత్తపుత్రులు అని పేర్కొన్నారు. ఈ రెండు సంస్థలకు పుట్టిన విష పుత్రిక ఇండో సోల్ సంస్థ అని సోమిరెడ్డి తెలిపారు.

‘‘ఇండోసోల్ ప్రాజెక్టుకు సోలార్ ప్రాజెక్టులు కట్టబెడుతున్నారు. విద్యుత్ రంగంలో భారీ ఎత్తున ట్రాన్స్ ఫార్మర్ల కుంభకోణం జరిగింది. వివిధ కెపాసిటీలతో ఉన్న ఒక్కో ట్రాన్సఫార్మరులోనే రూ.1 లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ దోపిడీ జరిగింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ట్రాన్సఫార్మర్ల కంటే చాలా అధిక మొత్తంలో ఏపీలో ధరలు ఉన్నాయి. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో దాదాపు 62 శాతం మేర ఆర్డర్లు షిర్టీ సాయి సంస్థకే వెళ్తున్నాయి. షిర్టీ సాయి సంస్థకు నాసిరకం ట్రాన్సఫార్మర్ల సరఫరా చేస్తోందనే అంశంపై గత ప్రభుత్వం పెనాల్టీ విధించింది. గత ప్రభుత్వం విధించిన ఆ పెనాల్టీని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.పెనాల్టీ రద్దు వెనుక మరో స్కాం ఉంది. పవర్ స్కాం పార్ట్-2లో మరిన్ని వివరాలు బయటపెడతా. దీన్ని వదిలి పెట్టేదే లేదు.. స్మార్ట్ మీటర్ల కుంభకోణంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాం.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ప్రతి ఒక్కరూ ఆధారపడే విద్యుత్ రంగంలో భారీ దోపిడీనా..? ఈ స్కాంల వల్లే పేదలపై విద్యుత్ భారం’’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-26T12:36:23+05:30 IST