Atchennaidu: వాటికి సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు..
ABN , First Publish Date - 2023-07-02T09:03:24+05:30 IST
అమరావతి: వైసీపీ నేతలు రోజు రోజుకు హద్దు మీరి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటిలో టీడీపీ నేత నాగరాజు ఇంటి ముందు ఉన్న కల్వర్టు కూల్చివేయటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
అమరావతి: వైసీపీ నేతలు (YCP Leaders) రోజు రోజుకు హద్దు మీరి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటిలో టీడీపీ నేత నాగరాజు (Nagaraju) ఇంటి ముందు ఉన్న కల్వర్టు కూల్చివేయటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchennaidu) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి (Jagan Reddy) తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ‘నాకది-నీకిది’ పద్దతిలో హైదారాబాద్, బెంగుళూరు, ఇడుపుల పాయలలో నిర్మించిన రాజప్రసాదాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) అక్రమాలను నిరంతరం ఎండగడుతున్నందుకే నియోజకవర్గంలో టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, పైగా అక్కడకు వెళ్లిన టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు.
‘ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా’ అన్న చందంగా వైసీపీ నేతల తీరు ఉందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ప్రతిపక్ష నేత ఇంటిని టార్గెట్ చేస్తే.. గ్రామ స్ధాయిలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారన్నారు. జగన్ సైకో లక్షణాలను వాళ్ల కార్యకర్తలు అనుసరిస్తున్నారని.. అందుకే ఈ దుర్మార్గాలు చేస్తున్నారన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష, నాగరాజు, బెందాలం అశోక్, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, పాలించమని వైసీపీకి అధికారమిస్తే ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలపైనే ప్రభుత్వ పెద్దలు దృష్టిసారించడం దుర్మార్గమన్నారు. కూల్చివేతలతో మొదలైన వైసీపీ ప్రభుత్వం.. వచ్చే ఎన్నికల్లో ప్రజాతీర్పుతో కూలడం ఖాయమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.