Bandaru Satyanarayana: ఎర్రన్నాయుడు ప్రజల మనిషి
ABN , First Publish Date - 2023-11-02T13:34:21+05:30 IST
టీడీపీ నేత ఎర్రంనాయుడు ప్రజల మనిషి అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.
శ్రీకాకుళం: టీడీపీ నేత ఎర్రంనాయుడు (TDP Leader Errannaidu) ప్రజల మనిషి అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Former Minister Bandaru Satyanarayana Murthy) అన్నారు. గురువారం దివంగత టిడిపి నేత ఎర్రంనాయుడు 11వ వర్ధంతి సందర్భంగా ఎంపీ రామ్మోహన్‌నాయుడు (MP Rammohan Naidu), టీడీపీ నేతలు (TDP Leaders) ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ.. ఎర్రన్న ఉత్తరాంధ్రలో పుట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. ఎర్రన్న పేరును రామ్మోహన్ నాయుడు నిలబెడుతున్నారని మాజీ మంత్రి కొనియాడారు.
రాష్ట్రంలో కుట్ర, కుళ్లు రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. మహానుభావుడు చంద్రబాబుని (TDP Chief Chandrababu Naidu) అన్యాయంగా 52 రోజులు బంధించారని.. సిగ్గు లేకుండా అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మద్యం ఏరులై పారిస్తున్నారన్నారు. జగన్ (CM Jagan) మద్యాన్ని త్రాగుబోతులు ఛీ కొడుతున్నారన్నారు. జగన్‌కు సిగ్గులేదని.. త్వరలో సీఎంకు మైన్డ్ బ్లాక్ అవుతుందని వ్యాఖ్యలు చేశఆరు. బాబాయిని చంపిన కిరాతకుడు జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. సజ్జల సర్పంచ్ కూడా కాలేదని.. సజ్జల జగన్ గుమస్తా అని విమర్శించారు. సజ్జల పిచ్చి కుక్క కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 రోజులే జగన్‌కు మిగిలి ఉందని.. తర్వాత జగన్ ఇంటికే అంటూ బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలు చేశారు.