TDP: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా శ్రీకాకుళం టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2023-06-04T08:56:20+05:30 IST

ఒడిశా: రైలు ప్రమాద బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నేతలను ఆదేశించారు.

TDP: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా శ్రీకాకుళం టీడీపీ నేతలు

ఒడిశా: రైలు ప్రమాద బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నేతలను ఆదేశించారు. దీంతో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ బాబు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఒడిశా బయలుదేరి వెళ్లారు. కటక్‌లోని ఎస్‌సీబీ వైద్య కళాశాలలో బాధితులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. బాధితులకు టీడీపీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. గాయపడి చికిత్స పొందుతున్న ప్రయాణీకులకు ధైర్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణీకుల వివరాలను రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కాగా ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా తమిళనాడు నుంచి, తమిళనాడు మీదుగా శని, ఆదివారాల్లో వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాల్సిన పలు రైళ్లను, అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి తమిళనాడు(Tamil Nadu)కు, తమిళనాడు మీదుగా వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. అదే విధంగా కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు.

శనివారం రద్దయిన రైళ్లు:

- విల్లుపురం - పురిలియా (22606)

- తిరువనంతపురం - షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌ (22641)

- బెంగుళూరు - కామాఖ్య ఏసీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12651)

- బెంగుళూరు - భగల్పూర్‌ అంగా ఎక్స్‌ప్రెస్‌ (12253)

- హౌరా - ఎర్నాకులం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ (22877)

- షాలిమార్‌ - చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841)

- చెన్నై సెంట్రల్‌ - హౌరా ఎక్స్‌ప్రెస్‌ (12840)

- మంగళూర్‌ - సంత్రాంగచ్చి వివేక్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22852)

- రంగపారా నార్త్‌ - ఈరోడ్‌ సూపర్‌ఫాస్ట్‌ (06074)

శనివారం దారి మళ్లించిన రైళ్లు:

- కన్యాకుమారి - డిబ్రూఘర్‌ వివేక్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22503)

- తిరుచ్చిరాపల్లి - హౌరా (12664)

- సిల్ఘాట్‌ టౌన్‌ - తాంబరం నాగోన్‌ ఎక్స్‌ప్రెస్‌ (15630)

ఆదివారం రద్దయిన రైళ్లు

చెన్నై సెంట్రల్‌-షాలిమార్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12842)

చెన్నై సెంట్రల్‌ - సంత్రాంగచ్చి ఏసీ సూపర్‌ఫాస్ట్‌ (22808)

Updated Date - 2023-06-04T08:56:20+05:30 IST