TDP: అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన నిరాశ్రయులకు ఆర్థిసాయాన్ని అందించిన బొరగం శ్రీనివాసులు
ABN , First Publish Date - 2023-03-08T22:36:30+05:30 IST
వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన 27 కుటుంబాలను పోలవరం నియోజకవర్గం (Polavaram Constituency) టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) పరామర్శించారు.
ఏలూరు జిల్లా: వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన 27 కుటుంబాలను పోలవరం నియోజకవర్గం (Polavaram Constituency) టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) పరామర్శించారు. బాధితులు అధైర్యపడవద్దని, టీడీపీ తరపున అన్నివిధాలా అండగా ఉంటామని బొరగం శ్రీనివాసులు, నేతలు, కార్యకర్తలు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, రూ. 5 వేల ఆర్థిక సాయం, దుప్పట్లు పంపిణీ చేశామని చెప్పారు. టేకూరు గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు ఇల్లు కోల్పోయిన నిరాశ్రయులను పరామర్శించి కుటుంబానికి 25 కేజీల బియ్యం, రూ. 5 వేల ఆర్థిక సాయం అందించామని బొగరం శ్రీనివాసులు తెలిపారు. అదే గ్రామంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన నూపా రాంబాబు కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం చేసినట్లు టీడీపీ నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అమరవరపు అశోక్, ప్రధాన కార్యదర్శి కట్టం రాంబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మొగపర్తి సొంబాబు, పారెపల్లి రామారావు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు గొంది నాగేశ్వరరావు, సున్నం నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి జారం చాందినీ విద్యాసాగరిక, ఏలూరు జిల్లా తెలుగు రైతు కార్యదర్శి గద్దె అబ్బులు, తెలుగురైతు ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు ఉండవల్లి సోమసుందరం, ఏలూరు జిల్లా తెలుగురైతు కార్యదర్శి చీమల వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మడకం రామకృష్ణ, ఉపాధ్యక్షులు తెల్లం వెంకటేశ్వరరావు, జిలుగుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు సుంకవల్లి సాయికృష్ణ, టీ నర్సాపురం మండల ప్రధాన కార్యదర్శి ఆచంట అనిల్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిన్నమనేని మధు, ఆచంట సూర్యనారాయణ, మక్కినవారిగూడెం సర్పంచ్ మెతుకుమిల్లి గోపాలరావు, ఏలూరు జిల్లా తెలుగుమహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, వేలేరుపాడు మాజీ జడ్పీటీసీ శాఖమూరి సంజీవులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు శావిలి ఆనందరావు, కురిమెల్ల సుధాకర్, ఉప్పాటి వెంకట్రావు, పసుమర్తి భీమేశ్వరరావు, గన్నిన సూర్యచంద్రరావు, తూంపాటి దుర్గారావు, గద్దె ప్రసాద్, కుంజం ప్రసాద్, చోడెం అర్జున్, ఆండ్రూ శ్యామ్ కుమార్, పఠాన్ రసూల్ ఖాన్, కొవ్వాసి శ్రీను, ఎండపల్లి నాగు, కరుటూరి రాధాక్రిష్ణ, కోటిపల్లి ముత్యాలరావు, చాపర్ల శ్రీను, అమరవరపు వెంకన్న కొమ్మనా వెంకటేశ్వరావు, త్రిమూర్తులు, కుక్కునూరి రాంబాబు, అనిల్, సీహెచ్ పోసి , భాషా, సరియం, మహేష్, పద్దం రమేష్, సోడే నాగేంద్రబాబుతోపాటు తదితరులు పాల్గొన్నారు.