Share News

AP HighCourt: చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2023-11-24T12:06:37+05:30 IST

Chandrababu Case: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఐఆర్‌ఆర్, ఇసుక కేసుల్లో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చంద్రబాబు విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది.

AP HighCourt: చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో  ఊరట

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు (TDP Chief Chandrababi Naidu) ఏపీ హైకోర్టులో (AP HighCourt) స్వల్ప ఊరట లభించింది. ఐఆర్‌ఆర్ (IRR Case), ఇసుక కేసుల్లో (Sand Case) తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చంద్రబాబు (TDP Chief) విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది. సీఐడీ (CID) తరపున అడ్వకేట్ జనరల్ (Advocate General) వాదనల కోసం ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసును ఈనెల 29న, ఇసుక కేసును ఈనెల 30కి హైకోర్టు వాయిదా వేసింది.


కాగా.. చంద్రబాబు నాయుడిపై నమోదైన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసు, ఇసుక కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కావాలంటూ బాబు తరపు న్యాయవాదులు నిన్న(గురువారం) సాయంత్రం వరకు వాదనలు వినిపించారు. ఈరోజు (శుక్రవారం) ఐఆర్‌ఆర్, ఇసుక కేసులో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే అడ్వకేట్ జనరల్ వేరే కోర్టులో ఉన్నారని సీఐడీ తరపున అడిషనల్ పీపీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో అడ్వకేట్ జనరల్ వాదనల కోసం ఐఆర్‌ఆర్ కేసును ఈనెల 29న, ఇసుక కేసును ఈనెల 30కి వాయిదా వేసింది. ఈ రెండు కేసుల్లో కూడా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు మద్యం కేసులో ఇప్పటికే చంద్రబాబు, ప్రభుత్వం వాదనలు పూర్తి అయ్యాయి. సోమవారం కోర్టు సమయం ముగిసే లోపు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి కూడా వెంటనే తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు ముందస్తు బెయిల్‌ కోసం పెండింగ్‌లో ఉన్న కేసులపై హైకోర్టులో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2023-11-24T12:24:28+05:30 IST