Share News

Chandrababu Letter: ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ..

ABN , First Publish Date - 2023-10-27T11:31:58+05:30 IST

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ పంపారు. ఈ నెల 25న జడ్జికి టీడీపీ అధినేత లేఖ రాశారు.

Chandrababu Letter: ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ..

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu).. ఏసీబీ కోర్టు జడ్జికు(ACB court judge) లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ పంపారు. ఈ నెల 25న జడ్జికి టీడీపీ అధినేత లేఖ రాశారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారు.


చంద్రబాబు లేఖలోని అంశాలు ఇవే...

‘‘నాకు జెడ్ ప్లస్ సెక్యూర్టీ ఉంది. నేను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా నన్ను వీడియోలు.. ఫొటోలు తీశారు. ఆ ఫుటేజ్‌ను స్వయంగా పోలీసులే లీక్ చేశారు. నా రెప్యూటేషన్‌ను దెబ్బ తీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. దీనికి సంబంధించిన లేఖను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఈ విషయమై లేఖ కూడా వచ్చింది. ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు’’ అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.


జైలులో భద్రతపై...

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో తన భద్రతపై కూడా చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ‘‘ఎస్ కోటకి చెందిన ఓ ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని నా దృష్టికి వచ్చింది. నా కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నాను. డ్రోన్లు ఎగరేసిన ఘటనలోనూ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. ఈ నెల 6న నన్ను కలవడానికి నా కుటుంబసభ్యులు వచ్చిన సందర్భంలో సెంట్రల్ జైలు మెయిన్ గేట్ వద్ద మరో డ్రోన్ ఎగరేశారు. నా భద్రతే కాదు.. నా కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నా. నాలుగున్నరేళ్ల కాలంలో నాపై వివిధ సందర్భాల్లో అధికారంలో ఉన్న వాళ్లు దాడులు చేశారు. గంజాయి ప్యాకెట్లు జైలు ప్రాంగణంలో గార్డెనింగ్ చేస్తున్న ఖైదీల వద్దకు విసిరేస్తున్నారు’’ అంటూ చంద్రబాబు లేఖలో చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-10-27T11:50:22+05:30 IST