Devineni uma: జగన్ అసమర్థత వల్లే కృష్ణా జాలాలపై ఏపీకి నష్టం
ABN , First Publish Date - 2023-10-05T13:23:51+05:30 IST
కృష్ణా జలాల మీద ఏపీ హక్కులను కాపాడాలన్న ప్రయత్నం చేసారా?.. ఇంటర్ స్టేట్ సమావేశం ఎప్పుడైనా పెట్టావా ? జగన్మోహన్ రెడ్డి ! అంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విజయవాడ: కృష్ణా జలాల మీద ఏపీ హక్కులను కాపాడాలన్న ప్రయత్నం చేసారా?.. ఇంటర్ స్టేట్ సమావేశం ఎప్పుడైనా పెట్టావా ? జగన్మోహన్ రెడ్డి ! (AP CM YS Jaganmohan reddy)అంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (TDP Leader Devineni Umamaheshwar rao) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాలపై ఏపీ హక్కును కోల్పోతే రాయలసీమ ఏడారి అవుతుందన్నారు. ‘‘నువ్వు ముఖ్యమంత్రి అయిన పాపానికి రాయలసీమ ప్రజల గొంతు కోసావు. తాడేపల్లి కొంపలో పబ్జీ ఆడుకుంటూ చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నావ్. ముఖ్యమంత్రిగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకుండా కనీసం ఇంటర్ స్టేట్ అధికారులు, సుప్రీం కోర్టులో మన న్యాయవాదులతో కేంద్రంపై ఎలా ఒత్తిడి తేవాలి అనే ప్రయత్నం చేయలేదు. ఆంధ్ర, తెలంగాణా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య జరగాల్సిన జలవివాదాన్ని నీ అసమర్థత వల్ల రెండు రాష్ట్రాలకే పరిమితం చేసినట్టుగా వార్తలొచ్చాయి. అసమర్థత, చేతగానితనం నీకు సోయలేకపోవడం వల్ల ఇవాళ కృష్ణాజలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగింది. కేంద్రంలో 22 మంది ఎంపీలుండి గడ్డి పీకుతున్నారా? ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి ?. ప్రత్యేక హోదాకు దిక్కూ దివాణం లేదు, పోలవరం ప్రాజెక్టుకు డీపీఆర్ 2 ఆమోదించుకోలేకపోయారు.. గోదావరిలో ముంచేసారు రైల్వేజోన్ ఊసే లేదు, విద్యుత్ బోర్డు డబ్బులు గాలికి వదిలేసారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా.. ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే ఇవాళ ఢిల్లీ వెళ్తున్నావ్.. కృష్ణా జలాల మీద మన హక్కుల్ని, ప్రయోజనాలను ఎలా కాపాడావు. షెడ్యూల్ 9, 10 ఆస్తుల విభజన జరగాలి దానిపై ఢిల్లీలో మాట్లాడే దమ్ము, ధైర్యం ఉందా సమాధానం చెప్పాలి?’’ అంటూ దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.